ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ తను కోలుకుంటున్నాన్నట్లుగా తాజాగా వెల్లడించాడు. కొన్ని నెలల క్రితం కంటే తాను మెరుగ్గా ఉన్నానని, రాబోయే కొద్ది నెలల్లో పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని పంత్ తెలిపాడు.
IPL వేలం 2024 : భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక ప్రధాన ఫిట్‌నెస్ అప్‌డేట్ ఇచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ వీడియో ద్వారా మాట్లాడిన పంత్, తాను చాలా మెరుగ్గా రాణిస్తున్నానని, రాబోయే కొద్ది నెలల్లో ఫిట్‌గా ఉండగలనని వెల్లడించాడు. ఐపీఎల్ వేలం కోసం పంత్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు.
పంత్ కోలుకోవడం వల్ల.. ఇప్పుడు అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆడే స్థితిలో ఉన్నాడని తెలుస్తోంది.పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలను నెరవేర్చలేకపోతే, IPL వేలం 2024లో అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించవచ్చని మీడియా సంస్థలు ఊహాగానాలు చేశాయి.
"కొన్ని నెలల క్రితం కంటే చాలా మెరుగ్గా ఉంది నా పరిస్థితి. ఉందని ఇంకా 100 శాతం కోలుకుంటున్నాను. మరికొద్ది నెల్లలో పూర్తిగా చేయగలనని ఆశిస్తున్నాను" అని రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ వీడియోలో చెప్పాడు. రిషబ్ పంత్ దూకుడుకు పేరోందాడు. వికెట్ కీపర్-బ్యాటర్ అయిన పంత్ ఒక సంవత్సరం క్రితం రూర్కీలోని ఇంటికి వెళ్తున్నప్పుడు కారు ప్రమాదానికి గురయ్యాడు. పంత్ కారు హైవేపై పడిపోవడంతో క్రికెటర్‌ను స్థానికులు కాపాడారు.
పంత్ కు అనేక శస్త్రచికిత్సలు అవసరం పడ్డాయి. అప్పటి నుండి కోలుకుంటున్నాడు. పంత్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ తన వర్కవుట్ సెషన్‌ల అప్‌డేట్‌లను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుంటాడు. మైదానానికి దూరంగా ఉన్న తన అనుభవం గురించి బ్యాటర్ మాట్లాడాడు. ప్రజలు తనపై ఇంత ప్రేమ చూపిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పాడు.
"ఇది నిజంగా అద్భుతంగా ఉంది. ఎందుకంటే క్రికెట్ ఆడనప్పుడల్లా మమ్మల్ని ఎవరూ ప్రేమించడం లేదని భావిస్తుంటాం. ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. వాస్తవానికి ఇది చాలా కష్ట సమయం. కానీ కనీసం ప్రజలు నన్ను ఇంకా ప్రేమిస్తున్నారని తెలుసుకున్నాను. వారు మమ్మల్ని గౌరవిస్తారు. నా గాయంనుంచి త్వరగా కోలుకోవాలని వారు చూపిన అభిమానం, ప్రమాదం విషయంలో పడ్డ ఆందోళన నన్ను కదిలించింది" అని రిషబ్ పంత్ అన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా పంత్ ఫిట్‌నెస్ గురించి నోరు మెదపలేదు కానీ 2024 టోర్నమెంట్ నుండి అతన్ని ఇంకా తొలగించలేదు. వాస్తవానికి, 2024 ఎడిషన్ టోర్నమెంట్‌లో పంత్ ఆడవచ్చని టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఇండియా టుడేకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
పంత్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో నుండి సైన్ ఆఫ్ చేసాడు. తాను ఎల్లప్పుడూ ఉత్తమమైన పనిని చేయడానికి ప్రయత్నిస్తానని, అభిమానులు ఫ్రాంచైజీకి వారి అత్యధిక, తక్కువ స్థాయికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు.