IPL Auction 2021: తెలుగు క్రికెటర్ హనుమ విహారికి చేదు అనుభవం

Published : Feb 18, 2021, 04:06 PM ISTUpdated : Feb 18, 2021, 04:25 PM IST
IPL Auction 2021: తెలుగు క్రికెటర్ హనుమ విహారికి చేదు అనుభవం

సారాంశం

'టీమిండియా క్రికెటర్ హనుమ విహారీకి ఐపిఎల్ వేలంలో చేదు అనుభవం ఎదురైంది. ఐపిఎల్ వేలంలో హనుమ విహారిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు.

చెన్నై: తెలుగు క్రికెటర్ హనుమ విహారిరకి చేదు అనుభవం ఎదురైంది. ఆయనను కొనడానికి ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపపలేదు. ఐపీఎల్ మినీ వేలం గురువారం సాయంత్రం 3 గంటలకు చెన్నైలో ప్రారంభమైన విషయ తెలిసిందే. 

అలాగే ఇండియన్ క్రికెటర్ కరుణ్ నాయర్ ను కొనడానికి కూడా ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. జాసన్ రాయ్ కూడా అమ్ముడు పోలేదు. వెస్టిండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్ ను కూడా కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచేజీ కూడా ముందుకు రాలేదు. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ ది కూడా అదే పరిస్థితి.

ఇంగ్లాండు ఆటగాడు అలెక్స్ హేల్స్ ను కొనుగోలు చేయడానికి కూడా ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ పేరు వేలంలో తొలుత వచ్చింది. అతని బేస్ ప్రైస్ రూ.50 లక్షలు. అయితే, అతన్ని కూడా ఏ ఫ్రాంచేజీ కొనుగోలు చేయలేదు. 

ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్వాగతోపన్యాసం చేశారు. బీసీసీఐ కార్యదర్శి జె. షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ దుమాల్ హాజరయ్యారు. ఐపిఎల్ ప్రకటనదారులకు, భాగస్వాములకు బ్రిజేష్ పటేల్ ధన్యవాదాలు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : 9 మంది ఆల్‌రౌండర్లతో ఆర్సీబీ సూపర్ స్ట్రాంగ్.. కానీ ఆ ఒక్కటే చిన్న భయం !
స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు