IPL Auction 2021 Live Updates: యువీ రికార్డు బ్రేక్... మోరిస్, జెమ్మీసన్, మ్యాక్స్‌వెల్‌పై కాసుల పంట

Published : Feb 18, 2021, 03:29 PM ISTUpdated : Feb 18, 2021, 08:19 PM IST
IPL Auction 2021 Live Updates:  యువీ రికార్డు బ్రేక్... మోరిస్, జెమ్మీసన్, మ్యాక్స్‌వెల్‌పై కాసుల పంట

సారాంశం

రూ.2 కోట్ల 20 లక్షలకు స్టీవ్ స్మిత్‌ను కొనుగోలు చేసిన ఢిల్లీ... బేస్ ప్రైజ్ నుంచి కేవలం 20 లక్షలకు పెరిగిన స్మిత్... మ్యాక్స్‌వెల్‌కి మరోసారి రికార్డు ధర... క్రిస్ మోరిస్ రికార్డు ధర...

అందరూ ఊహించినట్టుగానే సచిన్ టెండూల్కర్ వారసుడు ముంబై ఇండియన్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ వేలం ఆఖర్లో వేలానికి వచ్చిన అర్జున్ టెండూల్కర్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. 

ముందుగా ఊహించినట్టుగానే సచిన్ టెండూల్కర్ సొంత జట్టు లాంటి ముంబై ఇండియన్స్, అతన్ని బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది. సచిన్ టెండూల్కర్ 2008లో ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వగా, 2021 సీజన్‌లో అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 

పవన్ నేగీని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్. ఆకాశ్ సింగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. వెంకటేశ్ అయ్యర్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్.  

హర్భజన్ సింగ్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది కేకేఆర్. హరి నీశాంత్‌ని చెన్నై సూపర్ కింగ్స్‌ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.  బెన్ కట్టింగ్స్‌ను రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్. 

కేదార్ జాదవ్‌ను రూ.2 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. కరణ్ నాయర్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్. 

న్యూజిలాండ్ ప్లేయర్ జేమ్స్ నీశమ్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. ఆస్ట్రేలియా యంగ్ ఆల్‌రౌండర్ క్రిస్ గ్రీన్‌, శ్రీలంక పేసర్ ఉసురు ఉదానలను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు.

జలజ్ సక్సేనా‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...ఉత్కర్ష్ సింగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోల చేసింది పంజాబ్ కింగ్స్. వైభవ్ అరోరాను కేకేఆర్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఫాబియన్ అలెన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డానియల్ క్రిస్టియన్‌ కోసం కేకేఆర్, ఆర్‌సీబీ జట్లు పోటీ పడ్డాయి. క్రిస్టియన్‌ను రూ.4 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

లియాన్ లివింగ్‌స్టోన్‌ను రాజస్థాన్ రాయల్స్‌ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్, కరణ్ శర్మ, కెఎల్ శ్రీజిత్, బెన్ ద్వాసిస్, పెరియస్వామి, బెన్ మెక్‌డెర్మోట్, సీన్ అబ్బాట్, సిద్ధేశ్ లాడ్, తజిందర్ దిల్లాన్, పరేక్ మంకడ్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు.

సుయాశ్ ప్రభుదేశాయ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తెలుగు వికెట్ కీపర్ కెఎస్ భరత్‌‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

మరో తెలుగు కుర్రాడు హరిశంకర్ రెడ్డి‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. పేసర్ కుల్దిప్ యాదవ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. 

జలజ్ సక్సేనా‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...ఉత్కర్ష్ సింగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోల చేసింది పంజాబ్ కింగ్స్. వైభవ్ అరోరాను కేకేఆర్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఫాబియన్ అలెన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.

మొయిసిస్ హెండ్రిక్స్‌‌ను కొనుగోలు చేయడానికి ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. రూ.4 కోట్ల 20 లక్షలకు హెండ్రిక్స్‌ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. 

టామ్ కుర్రాన్‌ కోసం సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. రూ. 5 కోట్ల 25 లక్షలకు టామ్ కుర్రాన్‌ను కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. గురుకీరట్ సింగ్ మాన్, మార్నస్ లబుషేన్‌లను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. 

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కేల్ జెమ్మిసన్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడ్డాయి. రూ.15 కోట్ల భారీ మొత్తానికి జెమ్మిసన్‌ను కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్. 

షాన్ మార్ష్, కోరీ అండర్సన్, రోవన్ పోవెల్, డివోన్ కాన్వే, డారెన్ బ్రావో, రస్సీ వన్ డూసీ, మార్టిన్ గుప్టిల్‌లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. ఛతేశ్వర్ పూజారాను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. 

జగదీశ సుచిత్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కరియప్పను‌ రాజస్థాన్ రాయల్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.

ఆస్ట్రేలియా బౌలర్ రిలే మెరేడిత్‌ కోసం ఢిల్లీ, పంజాబ్ జట్లు పోటీపడ్డాయి. రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. ఎం. సిద్ధార్థ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 

లుక్మన్ మెరివాలాను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఛేతన్ సకారియా కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడ్డాయి. చేతన్ సకారియాను రూ.కోటి 20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. 

విష్ణు వినోద్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో 37 బంతుల్లో సెంచరీ చేసిన మహ్మద్ అజారుద్దీన్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.  

సచిన్ బేబీని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాజత్ పటిదార్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్. రిపల్ పటేల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. యంగ్ ప్లేయర్ షారుక్ ఖాన్‌ కోసం రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ, పంజాబ్ జట్లు పోటీపడ్డాయి. 

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ 2021 సీజన్‌లో టైటిల్ విన్నర్‌గా నిలిచిన తమిళనాడు జట్టు తరుపున ఆడిన షారుక్ ఖాన్‌ను రూ.5 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.  కృష్ణప్ప గౌతమ్‌ను కొనుగోలు చేసేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్, చెన్నై జట్లు పోటీపడ్డాయి. రూ.9 కోట్ల 25 లక్షలకు గౌతమ్‌ను కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. 

ఐపీఎల్ 2021 మినీ వేలంలో భారత సీనియర్ స్పిన్నర్, ‘టర్బోనేటర్’ హర్భజన్ సింగ్‌కి నిరాశే ఎదురైంది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలానికి వచ్చిన హర్భజన్ సింగ్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. అయితే మరో సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా కోసం ఢిల్లీ, ముంబై జట్లు పోటీపడ్డాయి. రూ.2.40 లక్షలకు పియూష్ చావ్లాను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. 

రూ.5 కోట్లకు నాథన్ కౌంటర్‌నీల్‌ను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. విండీస్ ఆల్‌రౌండర్ షెల్డ్రెన్ కాంట్రెల్‌ను ఏ జట్టు కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు. ఉమేశ్ యాదవ్‌ను రూ. కోటి కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. హర్భజన్ సింగ్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టు ఆసక్తి చూపలేదు.

ఆస్ట్రేలియా యంగ్ బౌలర్ జే రిచర్డ్‌సన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడ్డాయి. రూ.14 కోట్లకు జే రిచర్డ్‌సన్‌ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...

సామ్ బిల్లింగ్స్, గ్లెన్ ఫిలిప్స్, అలెక్స్ క్యారీలను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. న్యూజిలాండ్ క్రికెటర్ ఆడమ్ మిల్నే‌ను కొనుగోలు చేయడానికి రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి. ముంబై ఇండియన్స్ జట్టు రూ.3 కోట్ల 20 లక్షలకు ఆడమ్ మిల్నేను కొనుగోలు చేసింది. 

ఐసీసీ టీ20 టాప్ బ్యాట్స్‌మెన్ అయిన డేవిడ్ మలాన్‌ను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కేవలం బేస్ ప్రైజ్ రూ. కోటిన్నరకే మలాన్‌ను దక్కించుకుంది పంజాబ్ కింగ్స్. 

ఐపీఎల్ వేలంలో యువరాజ్ సింగ్ రూ.16 కోట్ల రికార్డు బద్ధలైంది. క్రిస్ మోరిస్‌ను ఏకంగా రూ.16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. 

శివమ్ దూబేని కొనుగోలు చేయడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోటీ జరిగింది. రూ.4కోట్ల 40 లక్షలకు శివమ్ దూబేని కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ కోసం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడ్డాయి. రూ.7 కోట్లకు మొయిన్ ఆలీని కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. 

కేదార్ జాదవ్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను కొనుగోలు చేసేందుకు పంజాబ్ కింగ్స్, కేకేఆర్ జట్లు పోటీపడుతున్నాయి. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ రూ.3 కోట్ల 20 లక్షలకు షకీబ్ అల్ హసన్‌ను కొనుగోలు చేసింది. 

ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేసింది. బేస్ ప్రైజ్ రూ.2 కోట్ల దగ్గర కొనుగోలు చేయడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆసక్తి చూపగా, ఢిల్లీ మరో రూ.20 లక్షలు పెంచి కొనుగోలు చేసింది.

ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోసం మరోసారి అన్ని జట్టు పోటీ పడ్డాయి. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాక్స్‌వెల్ కోసం పోటీపడడంతో రూ.2 కోట్ల నుంచి భారీగా ధర పెరుగుతూ పోయింది... 

గత వేలంలో రూ.10 కోట్ల 25 లక్షలు దక్కించుకున్న మ్యాక్స్‌వెల్, ఈ ఏడాది ఏకంగా రూ.14 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ హనుమ విహారి, కరణ్ నాయర్‌లతో పాటు బిగ్‌బాష్ లీగ్‌లో అదరగొట్టిన అలెక్స్ హేల్స్, జాసన్ రాయ్, ఆరోన్ ఫించ్‌లకు మొదటి సెట్‌లో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఇష్టపడలేదు. 

 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?