IPL Auction 2021: ఈరోజు 3 గంటలకు వేలం మొదలు... మొదటి ప్లేయర్ అతనే...

By team teluguFirst Published Feb 18, 2021, 9:40 AM IST
Highlights

చెన్నై వేదికగా ఐపీఎల్ సీజన్ 14 వేలం...

వేలం పాటలో పాల్గొననున్న 292 మంది ప్లేయర్లు...

164 మంది భారత ప్లేయర్లు కాగా, 125 మంది విదేశీ క్రికెటర్లు, ముగ్గురు అసోసియేట్ దేశాల క్రికెటర్లు...

ఐపీఎల్ సీజన్ 14 మినీ వేలం ఈరోజు సాయంత్రం 3 గంటలకు ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా జరిగే ఈ వేలం పాటలో 292 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ఐపీఎల్ మినీ వేలం కోసం మొత్తంగా 1114 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేయించుకున్నప్పటికీ, వారిలో 822 మందిని తొలగించి, 292 మందితో షార్ట్ లిస్టు తయారుచేశారు. మొత్తంగా షార్ట్ లిస్ట్ చేసిన ప్లేయర్లలో 164 మంది భారత ప్లేయర్లు కాగా, 125 మంది విదేశీ క్రికెటర్లు, ముగ్గురు అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఉన్నారు.

ఆస్ట్రేలియా వన్డే, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌తో వేలం ఆరంభం కానుంది. ఆరోన్ ఫించ్ బేస్ ప్రైజ్ కోటి రూపాయలు. గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఫించ్‌ను రూ.4 కోట్లకు పైగా చెల్లించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొట్టున్న జట్లలో పంజాబ్ కింగ్స్ పర్సులో రూ.53.2 కోట్లు ఉండగా రాజస్థాన్ రాయల్స్ రూ. 37.85 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 35.4 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ రూ.19.9 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ.15.35 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.13.4 కోట్లు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ రూ.10.75 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.10.75 కోట్లు ఉన్నాయి.

click me!