IPL 2025: ఐపీఎల్ ఫైనల్, ప్లేఆఫ్స్ ఎక్కడ జరుగుతాయి?

Published : May 21, 2025, 12:06 AM IST
IPL 2025 Final, Playoffs Venues

సారాంశం

IPL 2025 Final, Playoffs Venues: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ లో ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్  అడుగుపెట్టాయి. చివరి బెర్త్ కోసం ముంబై, ఢిల్లీ టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలను ప్రకటించింది.

IPL 2025 Final, Playoffs Venues: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ కోసం ముల్లన్‌పూర్, అహ్మదాబాద్‌లను వేదికలుగా ఖరారు చేసింది. “70 ఉత్కంఠభరిత లీగ్ మ్యాచ్‌ల తర్వాత, కొత్త చండీగఢ్‌లోని కొత్త పీసీఏ స్టేడియం మే 29న క్వాలిఫైయర్ 1, మే 30న ఎలిమినేటర్‌కు ఆతిథ్యం ఇస్తుంది” అని దేవజిత్ సైకియా తెలిపారు.

“ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం జూన్ 1న క్వాలిఫైయర్ 2, జూన్ 3న గ్రాండ్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుంది” అని ప్రకటనలో పేర్కొన్నారు.


ఆర్‌సీబీ-ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ లక్నోకి మార్పు

మే 23న బెంగళూరులో జరగాల్సిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరగాల్సిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌ను లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియానికి మార్చారు.

“బెంగళూరులో వాతావరణ పరిస్థితుల కారణంగా టాటా ఐపీఎల్ మ్యాచ్ నం. 65ని లక్నోకి మార్చాం” అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు.

ఆర్‌సీబీ ఇప్పటికే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది.

 

హైదరాబాద్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. శనివారం బెంగళూరులో జరగాల్సిన రాజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్‌సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 58వ మ్యాచ్ రద్దు కావడంతో, నైట్ రైడర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టాయి. చివరి బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికల వివరాలు ప్రకటించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చెత్త ఆటతో ఆ ఇద్దరిపై వేటు.. వైజాగ్ వన్డేకి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?