CSK vs RR: రాజస్థాన్ రాయల్స్ గెలుపు.. ఐపీఎల్ లో సీఎస్కే తొలిసారి ఇలా.. !

Published : May 20, 2025, 11:21 PM IST
csk vs rr

సారాంశం

IPL 2025 CSK vs RR: రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి ఐపీఎల్‌లో పాయింట్ల పట్టిక చివరి స్థానానికి పడిపోయింది. 

IPL 2025 CSK vs RR: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌రో ఓట‌మిని చ‌విచూసింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 62వ మ్యాచ్ లో చెన్నై-రాజ‌స్థాన్ త‌ల‌ప‌డ్డాయి.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది.ఈ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఇంకా 17 బంతులు మిగిలి ఉన్నప్పుడే టార్గెట్ ను చేధించి విజయం సాధించింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ ఈ మ్యాచ్ ఓడిపోవ‌డంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరింది.

టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంస‌న్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బ్యాటింగ్‌లో CSK బలమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఒకవైపు, కాన్వే తన వికెట్‌ను తొందరలోనే కోల్పోగా, మరోవైపు యంగ్ ప్లేయ‌ర్ ఆయుష్ మాత్రే 43 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిడిల్ ఆర్డర్‌లో డెవాల్డ్ బ్రెవిస్ 42 పరుగులు చేయగా, శివమ్ దూబే 39 పరుగులు చేసి జట్టును తిరిగి గాడిలో పెట్టాడు. దీంతో చెన్నై టీమ్ 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది.

188 పరుగుల టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మ‌రో 17 బంతులు మిగిలి వుండ‌గానే 6 వికెట్ల తేడాతో గెలిచింది. రాజ‌స్థాన్ కు మంచి ఆరంభం ల‌భించింది. య‌శ‌స్వి జైస్వాల్ 36 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ 57 పరుగుల హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 41 పరుగులు చేయగా, చివరాలో ధ్రువ్ జురేల్ 31* పరుగులతో రాజస్థాన్ కు విజయాన్ని అందించాడు.

చెన్నై బౌలింగ్ విభాగం మరోసారి ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. మధ్య ఓవర్లలో కీలక వికెట్లు తీసే అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోవడంతో, రాజస్థాన్ రాయల్స్ కు విజయాన్ని నిలకడగా సాధించడానికి సహాయపడింది.

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Vaibhav Suryavanshi: టీమిండియాలోకి వైభవ్.. ఒక్క మ్యాచ్‌కి ఎంత సంపాదిస్తాడో తెలుసా.?