
2025 Orange and Purple Cap winners: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. జూన్ 3న జరిగే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలు ఎవరో తెలిపిసోనుంది. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు ప్రైజ్ మనీ అందించనున్నారు.
గుజరాత్ టైటన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఐపీఎల్ 2025 సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా టాప్ లో కొనసాగుతున్నాడు. అతను ఆరెంజ్ క్యాప్ సాధించే అవకాశం ఉంది. అతను ఇప్పటివరకు 15 మ్యాచ్‌లలో 759 పరుగులు చేశాడు.
ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ 16 మ్యాచ్‌లలో 717 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే, ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ పోరు ముగిసింది కాబట్టి సూర్య కుమార్ యాదవ్.. సాయి సుదర్శన్‌ను దాటే అవకాశాలు లేవు.
గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 650 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్, విరాట్ కోహ్లీలు ఉన్నారు.
గుజరాత్ టైటన్స్ పేసర్ ప్రసిధ్ కృష్ణా ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 25 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకునే ప్లేయర్ గా టాప్ లో ఉన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ నూర్ అహ్మద్ 14 మ్యాచ్‌లలో 24 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో రెండవ స్థానంలో ఉన్నాడు. చెన్నై పోరు కూడా ముగిసింది కాబట్టి పర్పుల్ క్యాప్ రేసు నుంచి నూర్ అవుట్ అయ్యాడు.
ముంబయి ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బోల్ట్ 16 మ్యాచ్‌లలో 22 వికెట్లు సాధించి మూడవ స్థానాన్ని ఆక్రమించాడు.
ఆర్సీబీ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌కు పర్పుల్ క్యాప్ గెలిచే అవకాశం కూడా ఉంది. అయితే, అందుకు ఐపీఎల్ ఫైనల్‌లో అతను ఐదు వికెట్లు తీయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 21 వికెట్లు తీసుకున్నాడు.
ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు బీసీసీఐ రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందిస్తుంది.