
Orange and Purple Cap winners: ఐపీఎల్ 2025 ఉత్కంఠభరితంగా ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకొని చరిత్ర సృష్టించింది. కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో, విరాట్ కోహ్లీ, జోష్ హేజిల్‌వుడ్ వంటి స్టార్ ప్లేయర్లతో కూడిన బలమైన ప్రదర్శన ఆర్సీబీ విజయానికి దోహదపడింది.
అయితే, ఈ సీజన్‌లో అత్యంత ఆసక్తికర అంశాల్లో ఒకటి ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసు. ఫైనల్ మ్యాచ్ వరకు ఆసక్తికరంగా సాగింది. ఈ సీజన్ మొత్తంలో అద్భుతంగా రాణించిన ఈ ఆటగాళ్లు తమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించారు.
సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో 15 ఇన్నింగ్స్‌లు ఆడి, 54.21 సగటుతో మొత్తం 759 పరుగులు చేశారు. స్ట్రైక్ రేట్ 156.17గా ఉంది. కీలక సమయాల్లో పరుగులు చేసి తన జట్టును గెలుపు దిశగా నడిపించారు. అతను ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలవడంతో రూ.10 లక్షల నగదు అవార్డును అందుకున్నాడు.
యంగ్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 15 మ్యాచ్‌లలో 25 వికెట్లు తీసి, 19.52 సగటుతో బాట్స్‌మెన్‌ను పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. అతని వేగవంతమైన బంతులు, సులభంగా ఆడలేని యార్కర్లు ప్లేయర్లకు పెద్ద తలనొప్పిని తెప్పించాయి.
• సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్: జితేష్ శర్మ - రూ. 1 లక్ష, ట్రోఫీ
• ఫాంటసీ కింగ్ ఆఫ్ ది మ్యాచ్: శశాంక్ సింగ్ - రూ.1 లక్ష, ట్రోఫీ
• సూపర్ సిక్సెస్ ఆఫ్ ది మ్యాచ్: శశాంక్ సింగ్ - రూ.1 లక్ష, ట్రోఫీ
• ఫోర్స్ ఆఫ్ ది మ్యాచ్: ప్రియాంశ్ ఆర్య - రూ.1 లక్ష, ట్రోఫీ
• గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్: కృనాల్ పాండ్యా - రూ.1 లక్ష
• ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కృనాల్ పాండ్యా - రూ.5 లక్షలు, ట్రోఫీ
• ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: సాయి సుదర్శన్ - రూ.10 లక్షలు, ట్రోఫీ
• సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: వైభవ్ సూర్యవంశీ - రూ.10 లక్షలు, ట్రోఫీ
• ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్: సాయి సుదర్శన్ - రూ.10 లక్షలు, ట్రోఫీ
• సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్: నికోలస్ పూరన్ - రూ.10 లక్షలు, ట్రోఫీ
• ఫోర్స్ ఆఫ్ ది సీజన్: సాయి సుదర్శన్ - రూ.10 లక్షలు, ట్రోఫీ
• గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్: మహ్మద్ సిరాజ్ - రూ.10 లక్షలు, ట్రోఫీ
• కాచ్ ఆఫ్ ది సీజన్: కమిందు మెండిస్ - రూ.10 లక్షలు, ట్రోఫీ
• ఫెయిర్ ప్లే అవార్డ్: చెన్నై సూపర్ కింగ్స్
• మోస్ట్ వ్యాల్యూవబుల్ ప్లేయర్: సూర్యకుమార్ యాదవ్ - రూ.15 లక్షలు, ట్రోఫీ
• పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డ్: ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ - రూ.15 లక్షలు
• విజేత ఆర్సీబీ: రూ.20 కోట్లు
• రన్నరప్ పంజాబ్ కింగ్స్: రూ.12.5 కోట్లు