IPL 2025 prize money: ఐపీఎల్ 2025 ప్రైజ్ మనీ ఎంత? ఆర్సీబీ, పంజాబ్ జట్లకు ఎంత దక్కింది?

Published : Jun 04, 2025, 01:12 AM IST
RCB with IPL Trophy

సారాంశం

IPL 2025 Final RCB vs PBKS: ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. అద్భుతమైన ఆటతో పంజాబ్ ను ఓడించి ఆర్సీబీ ఛాంపియన్ గా నిలిచింది. అయితే, గెలిచిన, ఓడిన జట్లకు ఎంత ప్రైజ్ మనీ దక్కిందో తెలుసా?

IPL 2025 Prize money: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ విక్టరీతో కొత్త ఛాంపియన్ గా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రజత్ పాటిదార్ ఆర్సీబీకి తొలి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు.

జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు 191 పరుగుల టార్గెట్ ను ఉంచింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పంజాబ్ పై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలిచి ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా నిలిచింది.

ఐపీఎల్ 2025 ఫ్రైజ్ మనీ ఎంత? పంజాబ్ కు ఎంత దక్కింది? ఆర్సీబీకి ఎంత దక్కింది?

ఐపీఎల్ 2025లో ఛాంపియన్ గా నిలిచిన ఆర్సీబీకి  రూ.20 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. రెండో స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టుకు రూ.12.5 కోట్లు లభించాయి.

ఐపీఎల్ ప్రారంభంలో, 2008లో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవగా, ఆ టీమ్ రూ.4.8 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ రన్నరప్‌గా రూ.2.4 కోట్లు తీసుకుంది. ప్రస్తుతం ప్రైజ్ మనీ విలువ నాలుగు రెట్లు పెరిగింది.

ప్లేఆఫ్స్ చేరిన జట్లకు ఎంత ప్రైజ్ మనీ లభించింది?

ప్లేఆఫ్ స్టేజ్‌లోకి చేరిన జట్లకు కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. ఎలిమినేటర్‌లో టోర్నీ నుంచి అవుట్ అయిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ.6.5 కోట్లు లభించాయి. క్వాలిఫయర్ 2లో ఓడిన ముంబై ఇండియన్స్‌కు రూ.7 కోట్లు లభించాయి.

ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విజేతలు ఎంత ప్రైజ్ మనీ అందుకున్నారు?

వ్యక్తిగత ప్రతిభ చూపిన ప్లేయర్లకు కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నందుకు సాయి సుదర్శన్ కు రూ.10 లక్షల నగదు బహుమతి లభించింది. 

అలాగే, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా గుజరాత్ టైటన్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 25 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ప్రసిద్ధ్ కు రూ. 10 లక్షల నగదు బహుమతి లభించింది.

‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డుకు ఎంత ప్రైజ్ మనీ ఉంటుంది?

ఈసారి మెరుగైన ప్రదర్శన ఇచ్చిన యంగ్ క్రికెటర్‌కు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు కూడా ఇచ్చారు. ఈ అవార్డు పొందడానికి బీసీసీఐ నాలుగు అర్హతా ప్రమాణాలు నిర్దేశించింది. 1999 ఏప్రిల్ 1 తర్వాత పుట్టినవారు, 5 కంటే తక్కువ టెస్టులు లేదా 20 కంటే తక్కువ వన్డేలు ఆడిఉండాలి, సీజన్ ప్రారంభానికి ముందు 25 కంటే తక్కువ ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి, గతంలో ఈ అవార్డు గెలుచుకోకూడదు. ఈ అవార్డును అందుకున్న వారికి రూ.10 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చారు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా సాయి సుదర్శన్ నిచిచాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !