IPL 2024: ధోని టీమ్ టిక్కెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే.. ! ఐపీఎల్ టిక్కెట్ల బుకింగ్, ధ‌ర ఎంతో తెలుసా?

By Mahesh Rajamoni  |  First Published Mar 12, 2024, 12:43 PM IST

IPL 2024 tickets booking and price: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజ‌న్ (ఐపీఎల్ 2024) లో తొలి మ్యాచ్ చెన్నై సూప‌ర్ కింగ్స్-రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే కొన్ని జట్లు తమ సొంత మైదానంలో జరిగే మ్యాచ్ లకు మాత్రమే మ్యాచ్ టికెట్ల అమ్మకాలను ప్రారంభించాయి.
 


IPL 2024 tickets booking and price: ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ 17వ సీజ‌న్ (ఐపీఎల్ 2024) మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఎంఎస్ ధోని నాయ‌క‌త్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, విరాట్ కోహ్లీకి చెందిన‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఐపీఎల్ 2024 కోసం ప్ర‌స్తుతం అన్ని జట్లు తమ ఆటగాళ్లను ఒకచోట చేర్చి టైటిల్ గెలుపే ల‌క్ష్యంగా తీవ్రంగా శిక్షణ అందిస్తున్నాయి. ఆ క్రమంలోనే ప్రస్తుత చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు చెపాక్ మైదానంలో తీవ్ర శిక్షణలో నిమగ్నమయ్యారు.

ఈ పరిస్థితిలో చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడే మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయం మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని ప్రకటించారు. టికెట్ విక్రయ తేదీని త్వరలో ప్రకటిస్తారు. టిక్కెట్లను నేరుగా కొనుగోలు చేసి నకిలీ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని గతేడాది ఫిర్యాదు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఐపీఎల్ 2024 టిక్కెట్ల విక్రయానికి సంబంధించి ఐపీఎల్ కమిటీ లేదా బీసీసీఐ నుండి ఎటువంటి ప్రకటన లేదు. కానీ, వారి సొంత మైదానంలో  జ‌రిగే మ్యాచ్ ల కోసం కొన్ని జట్లు మ్యాచ్ టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించాయి.

Latest Videos

ఎన్ని రన్స్ చేశావ్.. జిమ్మి పేరుతో గెలికిన బెయిర్‌ స్టో ! ఒక్క మాటతో పరువు తీసిన గిల్‌.. వైరల్ వీడియో

ఐపీఎల్ టిక్కెట్ల బుకింగ్-ధ‌ర‌లు: 

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడే మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయం మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని ప్రకటించారు. టికెట్ విక్రయ తేదీని త్వరలో ప్రకటిస్తారు. టిక్కెట్లను నేరుగా కొనుగోలు చేసి నకిలీ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని గతేడాది ఫిర్యాదు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ కూడా త‌మ హోమ్ మ్యాచ్ ల టిక్కెట్ల విక్ర‌యాలు ప్రారంభించాయి.

టిక్కెట్ల‌ను ఎక్క‌డ కొనుగోలు చేయాలి? 

క్రికెట్ అభిమానులు ప్ర‌స్తుతం ఐపీఎల్ 2024 సీజ‌న్ చూడ‌టం కోసం సంబంధిత జ‌ట్ల అధికారిక వెబ్ బైట్ల‌లో మాత్ర‌మే టిక్కెట్ల‌ను కోనుగోలు చేయ‌డానికి వీలు ఉంది. త్వ‌ర‌లోనే ఐపీఎల్ అధికారిక వెబ్ సైట్ లో కూడా టిక్కెట్ల విక్ర‌యాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. యూపీఐ ద్వారా చెల్లింపులు  చేయ‌వ‌చ్చు. కొన్ని జ‌ట్లు మార్చి 6 నుంచే టిక్కెట్ల విక్ర‌యాలు ప్రారంభించాయి. అభిమానులు పేటీఎం ఇన్‌సైడర్ యాప్ లేదా వెబ్‌సైట్‌ను కూడా సందర్శించి టిక్కెట్లు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఐపీఎల్ టిక్కెట్ల ధ‌ర‌లు ఎంత‌? 

ఐపీఎల్ 2024 టిక్కెట్ల బుకింగ్ ను ఆయా జ‌ట్ల‌ అధికారిక వెబ్ సైట్ల‌లో ప్ర‌స్తుతం బుక్ చేసుకోవ‌చ్చు. ఐపీఎల్ టిక్కెట్ ధరలు రూ. 499 నుండి ప్రారంభమవుతాయి. మ్యాచ్, సీటింగ్ ఆధారంగా రూ. 15,000 వరకు ఉంటాయి. ఒక్కోసారి మ్యాచ్ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి టిక్కెట్ల ధ‌ర‌లు మారుతాయి. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయ‌వ‌చ్చు.

టీ20 నెంబ‌ర్.1 ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఎక్క‌డ‌? ఐపీఎల్ 2024 ఆడతాడా? లేదా ముంబైకి షాకిస్తాడా?

click me!