Under 19 World Cup 2024: అండ‌ర్19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భార‌త జ‌ట్టు ఇదే..!

Published : Feb 11, 2024, 01:24 PM IST
Under 19 World Cup 2024: అండ‌ర్19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భార‌త జ‌ట్టు ఇదే..!

సారాంశం

Under 19 World Cup final: బెనోని వేదిక‌గా భారత్-ఆస్ట్రేలియాల మ‌ధ్య అండర్-19 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచింది.   

Australia-India final: భార‌త్-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ అండ‌ర్ 19 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. బెనోని వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

జట్లు:

ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్(వికెట్ కీప‌ర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే. 

ఆస్ట్రేలియా U19 (ప్లేయింగ్ XI): హ్యారీ డిక్సన్, సామ్ కాన్స్టాస్, హ్యూ వీబ్జెన్( కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్(వికెట్ కీప‌ర్), ఆలివర్ పీక్, రాఫ్ మాక్‌మిల్లన్, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మన్, కల్లమ్ విడ్లర్.

వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఓట‌మికి యంగ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? 

గతేడాది నవంబర్ 19న, ఆస్ట్రేలియన్ జట్టు 2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని సీనియర్ భార‌త‌ జట్టును ఓటించింది. అయితే, ఇప్పుడు  ఉదయ్ సహారన్ నేతృత్వంలోని యంగ్ ఇండియా జ‌ట్టు ఆస్ట్రేలియన్ అండర్-19ని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. రెండో సెమీస్ స‌మ‌రానికి ముందు కెప్టెన్ సహారాన్ మాట్లాడుతూ, "ఫైనల్‌లో ఆస్ట్రేలియా లేదా పాకిస్తాన్ తలపడుతుందా అనేది పట్టింపు లేదు. మేము ప్రత్యర్థి జట్టుపై దృష్టి పెట్టడం.. మా ఆటపై దృష్టి సారిస్తున్నాము. మేము మ్యాచ్‌లవారీ వ్యూహాన్ని రూపొందించాము. ప్ర‌తి మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకుంటున్నామని" తెలిపాడు.

భారత అండర్-19 జట్టు 2012, 2018 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఏజ్ గ్రూప్ టోర్నీల్లో భారత జట్టు ఎప్పుడూ 'పవర్‌హౌస్'గా ఉంటూ ఈ టోర్నీలో తొమ్మిదోసారి ఫైనల్‌కు చేరడం ఇందుకు నిదర్శనం. భారత అండర్-19 జట్టు 2016 నుండి అన్ని ఫైనల్స్ ఆడింది, 2018, 2022 ఎడిషన్లలో టైటిల్స్ గెలుచుకుంది, అయితే 2016, 2020లో ఓడిపోయింది. 2008లో విరాట్ కోహ్లి సారథ్యంలోని జట్టు ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత అండర్-19 ప్రపంచకప్‌కు మంచి ఆదరణ లభించింది. లైవ్ టీవీ కవరేజ్, 'స్ట్రీమింగ్' కారణంగా దాని పట్ల క్యూరియాసిటీ మ‌రింత పెరిగింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే