IPL 2024: విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్, మ్యాక్స్ వెల్.. ఆర్సీబీ రిటైన్ చేసిన ఆట‌గాళ్ల జాబితా ఇదిగో..

By Mahesh Rajamoni  |  First Published Nov 28, 2023, 10:45 AM IST

IPLretention: IPL 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకా-కోలా అరేనాలో జరగాల్సి ఉంది. దీనికి ముందు ఐపీఎల్ జ‌ట్ల యాజ‌మాన్యాలు త‌మ జ‌ట్టు నుంచి వ‌దులుకున్న‌, అలాగే, జ‌ట్టుతోనే క‌ట్టిపెట్టుకున్న ఆట‌గాళ్ల వివ‌రాల‌ను ప్ర‌క‌టించాయి. ఫాఫ్ డు ప్లెసిస్ సార‌థ్యంలోని ఆర్సీబీలో  విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి హిట్టర్లు ఉన్నారు.
 


Royal Challengers Bangalore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభం నుంచి ఇప్పటి వరకు 16 ఎడిషన్ల‌లో ట్రోఫీ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2024 సీజన్ లో ఎలాగైనా ట్రోఫీని గెలుచుకోవాలని చూస్తోంది. వచ్చే ఎడిషన్ కోసం ఐపీఎల్ ఆటగాళ్ల వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుండగా, అంతకు ముందు ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్ర‌క‌టించాయి.

అనుకున్నట్లుగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ స్టార్ ఆటగాళ్లను నిలుపుకోవడంతో పాటు కొందరిని తప్పించింది. ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ స్థానంలో మయాంక్ డాగర్ జట్టులోకి వచ్చాడు. షాబాజ్ అహ్మద్ సన్‌రైజ‌ర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. మయాంక్ డాగ‌ర్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్, అతను బ్యాట్ తో  కూడా సహకారం అందించగలడు. దేశవాళీ క్రికెట్ లో మంచి ఫీల్డర్ గా గుర్తింపు పొందాడు. ఫాఫ్ డు ప్లెసిస్ సార‌థ్యంలోని ఆర్సీబీలో  విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి హిట్టర్లు ఉన్నారు.

Latest Videos

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసిన ఆటగాళ్ల వీరే.. 

01. ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్/ బ్యాటర్)
02. విరాట్ కోహ్లీ (బ్యాటర్)
03. గ్లెన్ మాక్స్‌వెల్ (ఆల్‌రౌండర్)
04. మహ్మద్ సిరాజ్ (ఫాస్ట్ బౌలర్)
05. దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్/ బ్యాట్స్‌మన్)
06. రజత్ పటీదార్ (బ్యాటర్
07. రీస్ టాప్లీ (ఫాస్ట్ బౌలర్)
08. విల్ జాక్స్ (బ్యాటర్)
09. సుయాష్ ప్రభుదేశాయ్ (ఆల్‌రౌండర్)
10. అనుజ్ రావత్ (బ్యాటర్)
11. మహిపాల్ లోమ్రోర్ (ఆల్‌రౌండర్)
12. మనోజ్ భాండాగే (ఆల్‌రౌండర్)
13. క‌ర‌ణ్ శర్మ 
14. మయాంక్ దాగర్ (ఆల్‌రౌండర్)
15. వైశాక్ విజయకుమార్ (ఫాస్ట్ బౌలర్)
16. ఆకాశ్ దీప్ (ఫాస్ట్ బౌలర్)
17. రాజన్ కుమార్ (ఆల్‌రౌండర్)
18. హిమాన్షు శర్మ (ఆల్‌రౌండర్)

ఆర్సీబీ విడుదల చేసిన ఆటగాళ్లు జాబితా.. 

01. వనిందు హసరంగా (ఆల్‌రౌండర్)
02. హర్షల్ పటేల్ (ఆల్‌రౌండర్)
03. జోష్ హేజిల్‌వుడ్ (ఫాస్ట్ బౌలర్)
04. ఫిన్ అలెన్ (బ్యాటర్)
05. మైఖేల్ బ్రేస్‌వెల్ (ఆల్‌రౌండర్)
06. డేవిడ్ విల్లీ (ఆల్‌రౌండర్) 
07. వెన్ పార్నేల్ 
08. సోను యాదవ్ (ఆల్‌రౌండర్)
09. అవినాష్ సింగ్ (ఫాస్ట్ బౌలర్)
10. సిద్ధార్థ్ కౌల్ (ఆల్‌రౌండర్)
11. కేదార్ జాదవ్ (ఆల్‌రౌండర్)

కాగా, ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీ రూ.40.75 కోట్లు మ‌నీప‌ర్సుతో వేలంలో పాల్గొన‌నుంది. ఖాళీగా ఉన్న ఏడు స్థానాలకు ఆటగాళ్లను వేలంలో తీసుకోనుండ‌గా, వారిలో వీరిలో నలుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

click me!