IPL 2024 : విరాట్‌ వీరవిహారం.. హోం గ్రౌండ్‍లో బెంగుళూర్ ఘన విజయం

By Rajesh KarampooriFirst Published Mar 25, 2024, 11:17 PM IST
Highlights

IPL 2024 RCB vs PBKS: ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా సోమవారం బెంగళూరు (Bengaluru), పంజాబ్ (Punjab) జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ పోరులో   రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  ఘనవిజయం సాధించింది. 
 

IPL 2024 RCB vs PBKS: ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా సోమవారం బెంగళూరు (Bengaluru), పంజాబ్ (Punjab) జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ పోరులో   రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 177 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్‌కు వచ్చిన బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో విరాట్‌ కోహ్లీ వీరవిహారం చేశాడు. 49 బంతుల్లో 77 పరుగులు చెలారేగాడు. ప్రత్యర్థి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక చివర్లో కార్తిక్‌ (28*), లామ్రార్‌(17*) చెలరేగి బెంగళూరును విజయ తీరాలకు చేర్చారు. ఇక పంజాబ్‌  బౌలర్లలో రబాడ, హర్‌ప్రీత్‌ బ్రార్‌ తలో రెండు వికెట్లు తీశారు. 

పంజాబ్ ఇన్నింగ్స్

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన  ధావన్ సారథ్యంలో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసి ఆర్సీబీకి 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ శుభారంభం దక్కలేదు. కేవలం  17 పరుగుల స్కోరు వద్ద జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది.ఇక మూడో ఓవర్ మూడో బంతికి జానీ బెయిర్‌స్టో.. విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తరువాత థర్డ్ ఫ్లెస్ లో బ్యాటింగ్‌కు వచ్చిన ప్రభాసిమ్రాన్ సింగ్ దూకుడుగా ఆడాడు. శిఖర్ ధావన్‌తో కలిసి రెండో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తొమ్మిదో ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు.  

ఫోర్త్ డౌన్ లో బ్యాటింగ్‌కు వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్ 17 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 12వ ఓవర్ చివరి బంతికి వికెట్ కీపర్ అనూజ్ రావత్ క్యాచ్ పట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 13వ ఓవర్ తొలి బంతికి 98 పరుగుల వద్ద శిఖర్ ధావన్‌ను అవుట్ అయ్యారు.ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 45 పరుగులు చేయగలిగాడు.

నాలుగు వికెట్ల తర్వాత జట్టుకు మంచి భాగస్వామ్యం అవసరం. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సామ్ కర్రాన్ ఐదో వికెట్‌కు జితేష్ శర్మతో కలిసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆట జోరు మీద సాగుతున్న  తరుణంలో 18వ ఓవర్లో యశ్ దయాళ్.. కరణ్‌ను పెవిలియన్‌కు పంపాడు. 23 పరుగులు చేసి వెనుదిరిగాడు. కాగా, జితేష్ శర్మ 154 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఒక ఫోర్, రెండు సిక్సర్ల సాయంతో 27 పరుగులు చేశాడు. పంజాబ్ తరుపున చివరి ఓవర్లో శశాంక్ సింగ్ 20 పరుగులు చేశాడు. ఒక ఫోర్, రెండు సిక్సర్ల సాయంతో 21 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో హర్‌ప్రీత్ బ్రార్ కూడా రెండు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ తరఫున మహ్మద్ సిరాజ్, గ్లెన్ మాక్స్‌వెల్ చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, యష్ దయాల్, అల్జారీ జోసెఫ్ ఒక్కో విజయాన్ని అందుకున్నారు.
 

click me!