
Bengaluru vs Chennai : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 17వ సీజన్ తొలి మ్యాచ్ లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుకల్లో పలువురు బాలీవుడ్ స్టార్లు తమ అద్భుతమైన ప్రదర్శనలతో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కి స్టేడియం వద్ద క్రికెట్ ప్రియుల కోలాహలం మొదలైంది. దీంతో మొత్తంగా చెన్నైలో క్రికెట్.. బాలీవుడ్ ఫ్లేవర్ కనిపిస్తోంది.
శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్రారంభ వేడుకలకు వేదిక సిద్ధమైంది. ప్రతి సంవత్సరం వినూత్నంగా ఐపీఎల్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం లైనప్‌లో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, గాయకుడు సోను నిగమ్‌తో పాటు మ్యూజిక్ కింగ్ ఏఆర్ రెహమాన్ ఉన్నారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభ వేడుకలు అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
CSK vs RCB: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని ధోని ఎందుకు వదులుకున్నాడు?
ప్రారంభ వేడుకలు శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా, మ్యాచ్ రాత్రి 8 గంటలకు షురూ కానుంది. స్వీడిష్ హౌస్ మాఫియాకు చెందిన డీజే ఆక్స్‌వెల్ కూడా తొలి మ్యాచ్‌కు ముందు అభిమానులను ఉర్రూతలూగిస్తాడని ఓపెనింగ్ సెర్మనీ ముందురోజు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. ఐపీఎల్ నిర్వాహకులు ఈ సీజన్‌లో ప్రారంభ క్లాష్‌పై కొంచెం భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ vs రన్నర్స్-అప్ ట్రెండ్‌ను బద్దలుకొడుతూ.. సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో ఎంఎస్ ధోని టీమ్ vs విరాట్ కోహ్లి టీమ్ లతో మ్యాచ్ ను ఆడిస్తున్నారు.
ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుకలను ఎక్కడ చూడాలి?
ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుకను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయనుండగా, వీక్షకులు దీనిని జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు.
CSK VS RCB: చెన్నైలో దుమ్మురేపడానికి సిద్ధమైన విరాట్ కోహ్లీ.. !