IPL 2024: దేశ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై అనేక సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే, ఈ సారి కూడా భారత్ లోనే ఐపీఎల్ జరగుతుందని లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు.
IPL 2024 Schedule: క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభం కానుందనీ, సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ పూర్తిగా దేశంలోనే నిర్వహించబడుతుందని లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ మంగళవారం తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఐపీఎల్ 17వ ఎడిషన్ షెడ్యూల్ ఇంకా వెల్లడించకపోవడానికి ఇదే ప్రధాన కారణం. దీంతో విదేశాల్లో ఐపీఎల్ నిర్వహిస్తారనే ప్రచారం సాగింది.
అరుణ్ ధుమాల్ పీటీఐతో మాట్లాడుతూ.. మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటిస్తామనీ, సాధారణ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన ఆటల జాబితాను నిర్ణయిస్తామని తెలిపారు. వచ్చే నెల ప్రారంభంలో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. "మేము టోర్నమెంట్ కోసం మార్చి 22 ప్రారంభం కోసం చూస్తున్నాము. మేము ప్రభుత్వ సంస్థలతో కలిసి పని చేస్తున్నాము. మొదట ప్రారంభ షెడ్యూల్‌ను విడుదల చేస్తాము. మొత్తం టోర్నమెంట్ భారతదేశంలోనే జరుగుతుంది" అని ధుమాల్ చెప్పారు.
IND vs ENG : బుమ్రాకు విశ్రాంతి.. తిరిగొచ్చిన కేఎల్ రాహుల్.. !
2009లో మాత్రమే ఐపీఎల్ పూర్తిగా విదేశాల్లో (దక్షిణాఫ్రికా) నిర్వహించగా, 2014 ఎడిషన్ సాధారణ ఎన్నికల కారణంగా యూఏఈలో పాక్షికంగా జరిగింది. అయితే 2019లో ఎన్నికలు జరిగినప్పటికీ భారత్‌లో టోర్నీని నిర్వహించారు. నగదు అధికంగా ఉండే లీగ్ ముగిసిన కొద్ది రోజుల్లోనే టీ20 ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది, ఫైనల్‌ను మే 26న నిర్వహించే అవకాశం ఉంది. జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో భారత్ తమ తొలి ప్రపంచకప్ మ్యాచ్‌ను ఆడనుంది. ఐసీసీ షోపీస్ జూన్ 1న యూఎస్ఏ, కెనడాల పోరుతో ప్రారంభమవుతుంది.
నియమం ప్రకారం, ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ గత ఏడాది ఫైనలిస్ట్‌ల మధ్య జరగాలి. అంటే గత ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ గుజరాత్ టైటాన్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. 2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం గత ఏడాది డిసెంబర్‌లో జరిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
అప్పుడు సచిన్.. ఇప్పుడు విరాట్ కోహ్లీ.. డీప్‌ఫేక్ వలలో టీమిండియా !