KKR, IPL 2024 Retention List: IPL 2024 వేలానికి ముందు తమ జట్టులో ఏయే ప్లేయర్లను ఉంచుకోవాలి? ఎవరిని రిలీజ్ చేసేయాలి? అనే విషయంపై ఫ్రాంచైజీలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా కీలకమైన ఆటగాళ్లను ఉంచుకొని, మరికొందరిని వదిలేసింది. ఆటగాళ్ల పూర్తి జాబితా మీ కోసం..
KKR, IPL 2024 Retention List: IPL 2024 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ రిటైన్ చేయబడిన , విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. నవంబర్ 26న మొత్తం 10 ఐపీఎల్ జట్లు తమ రిటైన్ మరియు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్ రౌండర్ శార్దూర్ ఠాకూర్‌ను విడుదల చేసింది. వీరితో పాటు 11 మంది ఆటగాళ్లను కేకేఆర్ విడుదల చేసింది. అటువంటి పరిస్థితిలో KKR రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా మీ కోసం..
వాస్తవానికి రెండుసార్లు IPL ఛాంపియన్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తదుపరి సీజన్ కోసం రిటైన్ చేయబడిన, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఇటీవల వన్డే వరల్డ్ కప్‌లో ఫెయిలైన శార్దూల్ ఠాకూర్‌ను కేకేఆర్ వదిలేయడం అందరికీ షాక్ కు గురి చేసింది. గతంలో శార్దూల్‌ను 10.75 కోట్లకు KKR కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, నారాయణ్ జగదీసన్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్‌లతో సహా పలువురు కీలక ఆటగాళ్లు ప్లేయర్లను కేకేఆర్ రిలీజ్ చేసేసింది.
ఈ టీంలో గతేడాది కూడా భారీ స్క్వాడ్ ఉండేది. కానీ.. వరుస ఫెల్యూర్ తో పలువురు ప్లేయర్లను పక్కన పెట్టేయాలని నిర్ణయించుకుంది షారుఖ్ ఖాన్ టీం. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తిరిగి రావడం వారికి చాలా ఫ్లస్ పాయింట్.. ఆ
జట్టును అతని చుట్టూ బిల్డ్ చేయాలని కేకేఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే కీ ఫ్లేయర్లను తన వద్ద ఉంచుకొని, మిగతా వాళ్లను రిలీజ్ చేసేసింది.
KKR విడుదలైన ఆటగాళ్ల జాబితా : షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, ఆర్య దేశాయ్, నారాయణ్ జగదీశన్, మన్‌దీప్ సింగ్, కుల్వంత్ ఖేజ్రోలియా, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, జాన్సన్ చార్లెస్.
KKR రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితా: నితీష్ రానా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, శ్రేయాస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, డేవిడ్ విజ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి.
IPL వేలం 2024 నవంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఇందులో ఆటగాళ్లను వేలం వేయడానికి KKR పర్స్‌లో రూ. 32.7 కోట్లను కలిగి ఉంది.