IND vs AUS: లక్ష్య ఛేదనలో తడబడ్డ ఆసీస్.. రెండో మ్యాచ్ లో భారత్ ఘన విజయం  

By Rajesh Karampoori  |  First Published Nov 26, 2023, 10:48 PM IST

India vs Australia 2nd T20: భారత్‌-ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ లో భాగంగా  తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లో టిమిండియా గెలుపు పొంది అధిక్యం కనబరించింది


India vs Australia 2nd T20: తిరువనంతపురం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్‌ రెండో మ్యాచ్‌ లో భారత ఘన విజయం సాధించింది. 235 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ టీం తడబడింది. 44 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. వరల్డ్ కప్ 2023 ఫైనల్లో భారత్ ను ఓడించిన ఆసీస్ పై యంగ్ టీమిండియా ప్రతికారం తీర్చుకుంటుంది. వర్డల్ కప్ చేజారిన ఈ టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని యంగ్ టీమిండియా కసి, పట్టుదలతో ఆడుతుంది. ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు.

తిరువనంతపురం వేదికగా జరిగిన రెండవ టీ 20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ విధ్వంసం స్రుష్టించారు. ఆదివారంగ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ టీమిండియా బ్యాట్స్ మెన్స్ చెలరేగి ఆడారు. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశారు. బౌలర్ ఎవరైనా సరే ప్రతి బంతిని బౌండరీ వైపుకు బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అనిపించింది. భారత్ తరఫున తొలిసారి ఒకే ఇన్నింగ్స్ లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలు సాధించారు.

Latest Videos

undefined

యశస్వి జైస్వాల్(53; 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (52; 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు), ఇషాన్ కిషన్(52; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఇలా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ అర్ధ శతకాల మోత మోగించారు. చివర్లో క్రీజులో అడుగుపెట్టిన రింకూ సింగ్ తొమ్మిది బంతుల్లో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఇలా ఆడిన ప్రతి బ్యాట్స్ మెన్స్ అదరగొట్టడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ తరుణంలో ఆస్ట్రేలియా తరఫున నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కస్ స్టోయినిస్‌కు ఒక వికెట్ దక్కింది. 

 అనంతరం 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో  రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలుత శుభారంభం చేసింది. రెండో ఓవర్‌లో జట్టు స్కోరు 30 పరుగులకు చేరుకుంది. దూకుడుగా ఆడే ప్రయత్నంలో కంగారూ జట్టు పట్టాలు తప్పింది. 19 పరుగుల వద్ద షార్ట్ అవుట్ కావడం ఆసీస్ జోష్ కు బ్రేకులు పడ్డాయి. ఆ తరువాత ఇంగ్లిష్‌ రెండు పరుగులు చేసి ఔట్‌ కాగా, 12 పరుగుల వద్ద మాక్స్‌వెల్‌ ఔటయ్యాడు. అనంతరం స్మిత్ కూడా 19 పరుగుల చేసి ఫెవిలియన్ చేరారు.

ఈ తరుణంలో స్టోయినిస్, డేవిడ్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. భారత్ ఓటమి దాదాపు ఖాయమైందిరా అనుకునే తరుణంలో డేవిడ్ అవుట్ అయ్యాడు. దీంతో భారత్ విజయం సాధిస్తుందనే ఆశలు మళ్లీ చికురించాయి.  డేవిడ్ 37, స్టోయినిస్ 45 పరుగులు చేశారు. చివర్లో మాథ్యూ వేడ్ అజేయంగా 42 పరుగులు చేశాడు. అయితే ఆస్ట్రేలియా జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరఫున ప్రముఖ్ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, ముఖేష్‌ కుమార్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. 

click me!