IPL 2024: ఐపీఎల్ 2024లో కీలక సమయంలో రాజస్థాన్ రాయల్స్‌కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ ఐపీఎల్ కు దూరం అయ్యాడు. రాజస్థాన్ తో పాటు బెంగళూరు, కోల్ కతా సహా పలు టీమ్ లకు బ్యాడ్ న్యూస్ అందింది.
Tata IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్లేఆఫ్ మ్యాచ్ లకు ముందు ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ టీమ్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ ఐపీఎల్ కు దూరం అయ్యాడు. ఈ స్టార్ ప్లేయర్ తిరిగి ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ జట్టు రెండో స్థానంలో ఉంది. 12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు సాధించింది. ఈ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం.ప్లేఆఫ్ మ్యాచ్ లకు ముందు బట్లర్ లేకపోవడం సంజూ శాంసన్ జట్టుకు బిగ్ షాక్ అనే చెప్పాలి.
బట్లర్ ఇంగ్లాండ్‌కు ఎందుకు వెళ్లాడు..?
టీ20 క్రికెట్‌లో ఇంగ్లాండ్ జట్టుకు జోస్ బట్లర్ కెప్టెన్‌గా ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్ కోసం అతను తన దేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. మే 22న ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య 4 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బట్లర్ వీడ్కోలు వీడియోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
We’ll miss you, Jos bhai! 🥺💗 pic.twitter.com/gnnbFgA0o8
— Rajasthan Royals (@rajasthanroyals)
సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన బట్లర్..
బట్లర్‌కు ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంగా అంతగా కలిసి రాలేదు కానీ, కొన్ని సూపర్బ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. కోల్ కతా నైట్ రైడర్స్ పై బట్లర్ సెంచరీ చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అతను టాప్ ఆర్డర్‌లో రాజస్థాన్ జట్టులో ముఖ్యమైన బ్యాట్స్‌మెన్. 11 మ్యాచ్‌ల్లో 359 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లలో బట్లర్ సగటు 39.89, స్ట్రైక్ రేట్ 140.78గా ఉంది.
ఆర్సీబీ, కేకేఆర్ లకు కూడా బిగ్ షాక్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీ ప్లేయర్ విల్ జాక్స్, కోల్‌కతా ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కూడా ఇంగ్లండ్ జట్టులో చేరనున్నారు. దీతో విల్ జాక్స్ ఆర్సీబీ జట్టుకు వీడ్కోలు పలికాడు. అతను కూడా ఇంగ్లాండ్‌కు బయలుదేరాడు. సాల్ట్ త్వరలోనే ఇంగ్లాండ్ కు వెళ్లనున్నాడు. జాక్ ఆర్సీబీ తరఫున 8 మ్యాచ్‌లలో 32.86 సగటు, 175.57 స్ట్రైక్ రేట్‌తో 230 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో కోల్‌కతాకు సాల్ట్ కీలక ప్లేయర్. సునీల్ నరైన్‌తో కలిసి జట్టుకు శుభారంభం అందించాడు. సాల్ట్ 12 మ్యాచ్‌ల్లో 435 పరుగులు చేశాడు.సగటు 39.55, స్ట్రైక్ రేట్ 182.00 తో పరుగుల వరద పారించాడు. విల్ జాక్ తో పాటు ఆర్సీబీ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ కూడా ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లాడు.
Jacksy and Toppers are heading back home for international duties and we wish them all the very best. ✈
You were incredible in the camp and on the field this IPL. See you soon, lads. 🤗 pic.twitter.com/qxyT5rqvU1
ఐపీఎల్ హిస్టరీలో కింగ్ కోహ్లీ మరో రికార్డు..