సూర్య మాస్ ఇన్నింగ్స్... ఆర్‌సీబీ మళ్లీ అదే తీరు! ఘన విజయంతో టాప్ 3లోకి ముంబై ఇండియన్స్...

Published : May 09, 2023, 11:11 PM IST
సూర్య మాస్ ఇన్నింగ్స్... ఆర్‌సీబీ మళ్లీ అదే తీరు! ఘన విజయంతో టాప్ 3లోకి ముంబై ఇండియన్స్...

సారాంశం

2023 సీజన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లో 200 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన ముంబై ఇండియన్స్... సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ హాఫ్ సెంచరీ, ఇషాన్ కిషన్, నేహాల్ వదేరా మెరుపులు...

సీజన్లు మారినా ఆర్‌సీబీ బౌలింగ్ మాత్రం మారడం లేదు. 200 స్కోరు చేసినా, దాన్ని కాపాడుకోవడంలో రాయల్ ఛాలెంజర్స్ విఫలమవుతూనే వస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లో 200 పరుగుల టార్గెట్‌ని ఊదేసింది ముంబై ఇండియన్స్. కీలక మ్యాచ్‌లో విజయం అందుకుని, పాయింట్ల పట్టికలో టాప్ 3లోకి దూసుకెళ్లింది.

 200 పరుగుల లక్ష్యఛేదనలో ముంబైకి శుభారంభం దక్కింది. 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 42 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, హసరంగ బౌలింగ్‌లో అనుజ్ రావత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తొలి వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కెప్టెన్ రోహిత్ శర్మ 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి హసరంగ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..

వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్. అయితే సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వదేరా కలిసి మూడో వికెట్‌కి 139 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సిరిజ్, హజల్‌వుడ్, హర్షల్ పటేల్, హసరంగ ఏ బౌలర్‌ని వదలకుండా బౌండరీలు బాదారు సూర్య, వదేరా..

సిరాజ్ బౌలింగ్‌లో 6,4 బాదిన సూర్యకుమార్ యాదవ్, హసరంగ బౌలింగ్‌లో 6,2, 6 బాదాడు.  35 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో కేదార్ జాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే 26 బంతుల్లో 8 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది ముంబై..

టిమ్ డేవిడ్ గోల్డెన్ డకౌట్ కాగా 34 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న నేహాల్ వదేరా సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించేశాడు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగుల స్కోరు చేయగలిగింది... విరాట్ కోహ్లీ 1, అనుజ్ రావత్ 6 పరుగులు చేసి జాసన్ బెహ్రాన్‌డార్ఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీని  ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కి 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని అవుట్ చేసిన జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. గత మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన మహిపాల్ లోమ్రోర్, 3 బంతులాడి 1 పరుగుకే అవుట్ కాగా 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. వరుసగా 3 ఓవర్లలో 3 కీలక వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ.

18 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో నేహాల్ వదేరాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేదార్ జాదవ్ 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేయగా హసరంగ 12 పరుగులు చేశాడు. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !