
ఐపీఎల్ 2023 సీజన్‌లో విరాట్ కోహ్లీ ఫెయిలైన మ్యాచుల్లో ఆర్‌సీబీని కాపాడుతూ వచ్చిన ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరోసారి మెరుపులు మెరిపించారు. కోహ్లీ 1 పరుగుకే పెవిలియన్ చేరినా ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగుల స్కోరు చేయగలిగింది...
4 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్ వేసిన మొదటి ఓవర్‌లోనే వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న ముంబై ఇండియన్స్‌కి ఫలితం దక్కింది..
4 బంతుల్లో ఓ ఫోర్ బాది 6 పరుగులు చేసిన అనుజ్ రావత్, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ.
ఈ దశలో ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కలిసి ముంబై ఇండియన్స్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కి 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
2023 సీజన్‌లో ఈ ఇద్దరి మధ్య నాలుగో సెంచరీ భాగస్వామ్యం ఇది. ఓ వైపు మ్యాక్స్‌వెల్, మరో ఎండ్‌లో ఫాఫ్ డుప్లిసిస్ బౌండరీలు బాదడంతో 12 ఓవర్లలో 131 పరుగుల మార్కు దాటేసింది ఆర్‌సీబీ..
ఫాఫ్ డుప్లిసిస్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకోగా ఫాఫ్ డుప్లిసిస్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి కారణంగా పియూష్ చావ్లా 4 ఓర్లలో 41 పరుగులు సమర్పించాడు..
33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని అవుట్ చేసిన జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. గత మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన మహిపాల్ లోమ్రోర్, 3 బంతులాడి 1 పరుగుకే కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో విష్ణు వినోద్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వరుసగా 3 ఓవర్లలో 3 కీలక వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ.
15 పరుగుల వద్ద దినేశ్ కార్తీక్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ని కామెరూన్ గ్రీన్ డ్రాప్ చేశాడు. కుమార్ కార్తీకేయ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 15 పరుగులు రాబట్టాడు దినేశ్ కార్తీక్..
18 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో నేహాల్ వదేరాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వానిందు హసరంగ వస్తూనే రెండు ఫోర్లు బాదగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులోకి వచ్చిన కేదార్ జాదవ్ 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేయగా ఆఖరి ఓవర్ వేసిన ఆకాశ్ మద్వాల్ 6 పరుగులే ఇచ్చాడు.