
టీమిండియా మాజీ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్, పార్లమెంట్ సభ్యుడు గౌతమ్ గంభీర్ అగ్రెసివ్ పర్సన్ మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తి కూడా. ఢిల్లీలో 100 మంది నిరుపేదలకు నిత్యం అన్నదానం చేస్తున్న గౌతమ్ గంభీర్, తాజాగా భారత మాజీ క్రికెటర్ రాహుల్ శర్మ కుటుంబానికి ఆర్థిక సాయం చేశాడు..
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చిన రాహుల్ శర్మ, భారత జట్టు తరుపున 4 వన్డేలు, 2 టీ20 మ్యాచులు ఆడాడు. మొత్తంగా 9 వికెట్లు తీసిన రాహుల్ శర్మ అత్త కొన్నాళ్లుగా బ్రెయిన్ హోమరేజ్ వ్యాధితో బాధపడుతోంది.
రాహుల్ శర్మ అత్త ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న గౌతమ్ గంభీర్, ఆమె వైద్యానికి బెస్ట్ న్యూరోలాజిస్ట్ ఉన్న ఆసుపత్రిలో వైద్య ఏర్పాట్లు చేశాడట. ఈ విషయాన్ని రాహుల్ శర్మ ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు..
‘గత నెల చాలా కష్టంగా గడిచింది. మా అత్త గారికి బ్రెయిన్ హోమరేజ్ వచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. ఈ సమయంలో గౌతమ్ గంభీర్ పాజీ, అతని పీఏ గౌరవ్ అరోరా మమ్మల్ని ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేశారు. చాలా తక్కువ సమయంలోనే బెస్ట్ ఆసుపత్రిలో బెస్ట్ న్యూరోలాజిస్ట్‌తో వైద్యం ఏర్పాటు చేశారు..
సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉన్నారు...’ అంటూ వైద్యం అందించిన డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందికి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు రాహుల్ శర్మ..
ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, పూణే వారియర్స్ ఇండియా, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి ఆడిన రాహుల్ శర్మ, కెరీర్ ఆరంభంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. సౌతాఫ్రికా క్రికెటర్ వేర్న్ పార్నెల్‌తో కలిసి రేవ్ పార్టీలో పాల్గొన్న రాహుల్ శర్మ, అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది..
ఈ సంఘటన తర్వాత పూర్తిగా క్రికెట్‌కి దూరమైన రాహుల్ శర్మ, ఐపీఎల్‌లో 44 మ్యాచులు ఆడి 40 వికెట్లు తీశాడు. 2022 ఆగస్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు రిటైర్మెంట్ ప్రకటించాడు రాహుల్ శర్మ..
టీ20 వరల్డ్ కప్ 2007, వన్డే వరల్డ్ కప్ 2011 విజయాల్లో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్, ఐపీఎల్‌లో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్‌కి ఆడాడు. క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి, ఎంపీగా గెలిచిన గౌతమ్ గంభీర్, ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కి మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు..