లక్నోను నిలువరించిన రాజస్తాన్ బౌలర్లు. శాంసన్ సేనకు టార్గెట్ ఎంతంటే..?

Published : Apr 19, 2023, 09:16 PM ISTUpdated : Apr 19, 2023, 09:20 PM IST
లక్నోను నిలువరించిన  రాజస్తాన్ బౌలర్లు. శాంసన్ సేనకు టార్గెట్ ఎంతంటే..?

సారాంశం

IPL 2023, RR vs LSG:  చేతి నిండా వికెట్లున్నా.. జట్టులో  క్లీన్ హిట్టర్స్ ఉన్నా రాజస్తాన్ బౌలర్ల ముందు వాళ్ల పప్పులుడకలేదు.  జైపూర్ లో  రాజస్తాన్ బౌలర్లు రాణించడంతో లక్నో తక్కువ స్కోరుకే పరిమితమైంది.   

ఐపీఎల్ - 16లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు నిలకడగా రాణించడంతో లక్నో  బ్యాటర్లు  పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు. చేతి నిండా వికెట్లున్నా.. జట్టులో  క్లీన్ హిట్టర్స్ ఉన్నా రాజస్తాన్ బౌలర్ల ముందు వాళ్ల పప్పులుడకలేదు. నిర్ణీత  20 ఓవర్లలో  లక్నో.. 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఓపెనర్  కైల్ మేయర్స్ (42 బంతుల్లో 51, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)  హాఫ్ సెంచరీకి తోడు చివర్లో నికోలస్ పూరన్  (20 బంతుల్లో 28, 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో  లక్నో ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. 

టాస్ ఓడి  బ్యాటింగ్‌కు వచ్చిన లక్నో ఇన్నింగ్స్ మరీ నెమ్మదిగా ఆరంభమైంది. తొలి నాలుగు ఓవర్లలో ఆ జట్టు చేసింది  18 పరుగులే. కైల్ మేయర్స్, కేఎల్  రాహుల్ (39, 32 బంతుల్లో  4 ఫోర్లు, 1 సిక్స్)  మరీ నెమ్మదిగా ఆడారు.  పవర్ ప్లే లో ఆ జట్టు  37 పరుగులు మాత్రమే చేయగలిగింది.

రాహుల్ ఇచ్చిన  క్యాచ్ లను యశస్వి జైస్వాల్, జేసన్ హోల్డర్ లు మిస్ చేశారు.  ఈ అవకాశాన్ని అతడు వినియోగించుకోలేకపోయాడు.   చాహల్ వేసిన  9వ ఓవర్లో  మేయర్స్ 6, 4 కొట్టి  లక్నో ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చే యత్నం చేశాడు. ఇదే ఓవర్లో రాహుల్ సిక్సర్ కొట్టాడు. కానీ హోల్డర్ వేసిన 11వ ఓవర్లో  రాహుల్.. లాంగాన్ లో బట్లర్ చేతికి చిక్కాడు. 

వన్ డౌన్ లో వచ్చిన అయుష్ బదోని (1)  తో పాటు లోకల్ బాయ్ దీపక్ హుడా  (2) విఫలమయ్యారు. బదోనిని బౌల్డ్ క్లీన్ బైల్డ్ చేయగా   హుడాను  అశ్విన్ ఔట్ చేశాడు.  చాహల్ బౌలింగ్ లో  రెండు ఫోర్లు కొట్టి హాఫ్ సెంచరీ   పూర్తి చేసుకున్న  మేయర్స్ కూడా అశ్విన్ వేసిన 14వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  దీంతో లక్నో.. 14 ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి  104 పరుగులు చేసింది.  

 

మేయర్స్ నిష్క్రమించిన తర్వాత  వచ్చిన హిట్టర్స్  స్టోయినిస్ (16 బంతుల్లో 21, 2 ఫోర్లు), పూరన్ లు క్రీజులో ఉన్నా నాలుగు ఓవర్లలో లక్నో 25 పరుగులే చేయగలిగింది. లక్నో స్కోరు 150 దాటిందంటే అది కూడా ఆఖర్లో పూరన్ బాదడం వల్లే. జేసన్ హోల్డర్ వేసిన 19వ ఓవర్లో   పూరన్ 6,  4, 4  బాదాడు.   కానీ సందీప్ శర్మ  వేసిన 20 ఓ వర్లలో   8 పరుగులే రాగా 3 వికెట్లు కూడా కోల్పోయింది లక్నో. ఫలితంగా 20 ఓవర్లలో  154 పరుగులకే పరిమితమైంది.  లక్నో బౌలర్లలో  అశ్విన్ రెండు వికెట్లు తీయగా  బౌల్ట్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసి 16 పరుగులే ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు.  సందీప్, హోల్డర్ కు తలా ఓ వికెట్ దక్కింది. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !
T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !