IPL 2023, RCB vs RR: రాయల్స్‌తో రాయల్ ఢీ.. రాజస్తాన్‌తో పోరులో టాస్ ఓడిన బెంగళూరు

Published : Apr 23, 2023, 03:04 PM ISTUpdated : Apr 23, 2023, 03:13 PM IST
IPL 2023, RCB vs RR: రాయల్స్‌తో రాయల్ ఢీ.. రాజస్తాన్‌తో పోరులో టాస్ ఓడిన బెంగళూరు

సారాంశం

IPL 2023, RCB vs RR: ఐపీఎల్ -16  పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న  రాజస్తాన్ రాయల్స్.. నేడు  బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతున్నది. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ - 2023 సీజన్ ‌లో  నేడు మరో ఆసక్తికర సమరానికి తెర లేచింది.  పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన ఉన్న రాజస్తాన్ రాయల్స్.. ఆరో స్థానంలో ఉన్న   రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతున్నది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో  జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.  ఆర్సీబీ  బ్యాటింగ్ చేయనుంది. పక్కటెముకల గాయం నుంచి కోలుకోకపోవడంతో డుప్లెసిస్ స్థానంలో ఈ మ్యాచ్ లో కూడా కోహ్లీ సారథిగా వ్యవహరిస్తున్నాడు. డుప్లెసిస్ మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్ గా రాబోతున్నాడు. 

ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ లలో నాలుగు గెలిచిన  రాజస్తాన్.. జైపూర్ లో జరిగిన గత మ్యాచ్ లో ఓడింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా ముగిసిన ఈ మ్యాచ్ లో   గెలుపు అంచుల దాకా వచ్చినా  రాజస్తాన్ కు ఓటమి  తప్పలేదు. 

ఆర్సీబీ కూడా  ఆడిన 6 మ్యాచ్ లలో  3 గెలిచి మూడు ఓడింది. ఇదే వేదికపై కొద్దిరోజుల క్రితమే  200 ప్లస్ టార్గెట్ లో  చేరువగా వచ్చిన  ఆర్సీబీ..   ఆఖర్లో తడబడి ఓటమిని మూటగట్టుకుంది.  కానీ  పంజాబ్ తో మ్యాచ్ లో మాత్రం  గెలిచి తిరిగి ట్రాక్ లోకి వచ్చింది.  

బ్యాటర్లకు స్వర్గధామంగా ఉండే  చిన్నస్వామి స్టేడియంలో మరోసారి భారీ స్కోర్లు  నమోదవ్వడం ఖాయం. ఇదే వేదికపై ముంబై, ఢిల్లీలను ఓడించిన ఆర్సీబీ..  చెన్నై చేతిలో ఓడింది.  ఆర్సీబీ  బ్యాటింగ్ త్రయం కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్ (కేజీఎఫ్)  ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. చిన్నస్వామిలో కోహ్లీ.. ముంబై, ఢిల్లీ పై హాఫ్ సెంచరీలతో చెలరేగాడు.  ఈ మ్యాచ్ లో కూడా కేజీఎఫ్ పైనే భారీ ఆశలు పెట్టుకుంది ఆర్సీబీ. 

ఐపీఎల్ లో ఇరు జట్ల మధ్య 27 మ్యాచ్  లు జరుగగా  13 ఆర్సీబీ,  రాజస్తాన్ 12 మ్యాచ్ లలో నెగ్గింది.  చిన్నస్వామిలో  రెండు జట్లూ  8 మ్యాచ్ లలో తలపడగా రాజస్తాన్ (4) దే బెంగళూరు (2)  దే పైచేయిగా ఉంది.  రెండు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. 

 

తుది జట్లు :

రాజస్తాన్ రాయల్స్ : జోస్ బట్లర్,  యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మెయర్, ధ్రువ్ జురెల్, అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్,  గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రర్,  దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, సుయాశ్ ప్రభుదేశాయ్, హర్షల్ పటేల్,  డేవిడ్ విల్లే, మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్ వైశాఖ్

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు