
ఆటతో కంటే మార్కస్ స్టోయినిస్‌తో తేడా వేషాలు వేస్తూనే ఎక్కువ పబ్లిసిటీ సంపాదించుకున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా. పెవిలియన్‌లో ఆడమ్ జంపాపై చేతులు వేసిన స్టోయినిస్ సరసాలు ఆడడం, స్టోయినిస్‌ని ఎక్కడో పట్టుకుని ఆడమ్ జంపా ఆసీస్ జాతీయ గీతాన్ని ఆలపించడం వంటివి అప్పట్లో మీడియాలో పెను సంచలనం క్రియేట్ చేశాయి. ఈ ఇద్దరూ స్వలింగ సంపర్కులని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా తీవ్రంగా ప్రచారం జరిగింది..
గతంలో ఈ ఇద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి ఆడారు. ప్రస్తుతం మార్కస్ స్టోయినిస్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌లో ఉంటే, ఆడమ్ జంపా రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్నాడు. ఆట ఎలా ఉన్నా సోషల్ మీడియాలో రాజస్థాన్ రాయల్స్ వేసే పోస్టులకు మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉంది..
తాజాగా రాజస్థాన్ రాయల్స్, ఆడమ్ జంపా గురించి ఓ పోస్ట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆడమ్ జంపా ఫోన్‌లో ఏదో టైప్ చేసి, పక్కనే ఉన్న ట్రెంట్ బౌల్ట్‌కి చూపించాడు. ట్రెంట్ బౌల్ట్ దాన్ని చూసి పగలబడి నవ్వేశాడు. ఆడమ్ జంపా మాత్రం నవ్వకుండా.. ‘బ్రిలియెంట్ రైట్’ అంటూ అన్నాడు..
ఆ తర్వాత కెమెరాకి తన మెసేజ్‌ని చూపించాడు ఆడమ్ జంపా. అందులో ‘హే మేట్.. ఇది ఇక వర్కవుట్ కాదని నాకు అనిపిస్తోంది. బౌల్టీ నా కొత్త బెస్ట్ ఫ్రెండ్’ అంటూ మార్కస్ స్టోయినిస్‌కి మెసేజ్ చేశాడు ఆడమ్ జంపా. దీనికి మార్కస్ స్టోయినిస్ ఆశ్చర్యపోతూ క్వశ్చన్ మార్కులను రిప్లై ఇచ్చాడు..
వాస్తవానికి ఆడమ్ జంపా, రెండేళ్ల క్రితమే తన లాంగ్ టైం గర్ల్‌ఫ్రెండ్ హ్యాటీ లీగ్ పాల్మర్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఐపీఎల్ 2020కి ముందు పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్న ఆడమ్ జంపా, హ్యాటీ.. కరోనా కారణంగా వాయిదా పడి జూన్, 2021లో జరిగింది. స్టోయినిస్ కూడా తన గర్ల్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్నారు..
దీంతో వీళ్లిద్దరూ గేలు అని, వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందని చాలా కాలంగా నడిచిన చర్చకు తెరపడింది. అయితే అది నిజంగా కాదని కేవలం సరదాకి ఆ ఇద్దరూ అలా ప్రవర్తించారని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఈ ఇద్దరూ బై సెక్సువల్స్ (స్వలింగ సంపర్కంతో కూడా మహిళలతో కూడా సెక్స్ చేసేవాళ్లు) అని అంటున్నారు..
ఆస్ట్రేలియా యంగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాకి ఇండియాలో మంచి రికార్డు ఉంది. టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడమ్ జంపా, ఆఖరి వన్డేలో 4 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఆడమ్ జంపా, బేస్ ప్రైజ్ రూ.1 కోటి 50 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 14 మ్యాచులు ఆడిన ఆడమ్ జంపా, 21 వికెట్లు తీశాడు. 2021 సీజన్‌లో ఆర్‌సీబీ, ఆడమ్ జంపాని కొనుగోలు చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కేసులకు భయపడి చెప్పాపెట్టకుండా స్వదేశానికి పయనమయ్యాడు ఆడమ్ జంపా...
ఈ కారణంగానే ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ వంటి ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ముందుకు రాలేదు. ఈసారి ఆడమ్ జంపాను రాజస్థాన్ కొనుగోలు చేసినా.. రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్ వంటి స్పిన్నర్లు ఆర్ఆర్‌లో ఉండడంతో ఆసీస్ యంగ్ స్పిన్నర్‌కి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే..