అన్నీ సాయిబాబా చూస్తున్నాడు.. ఇక నీకు మళ్లీ టీమ్‌లో ప్లేస్ దక్కితే అద్భుతమే.. పృథ్వీ షాపై దారుణంగా ట్రోలింగ్

Published : Apr 15, 2023, 06:37 PM IST
అన్నీ సాయిబాబా చూస్తున్నాడు.. ఇక నీకు మళ్లీ టీమ్‌లో ప్లేస్ దక్కితే అద్భుతమే.. పృథ్వీ షాపై దారుణంగా ట్రోలింగ్

సారాంశం

IPL 2023: ఐపీఎల్ - 16లో   పృథ్వీ షా అట్టర్ ఫ్లాఫ్  షో కొనసాగుతోంది.  ఇప్పటివరకు ఈ సీజన్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన అతడు.. పట్టుమని పది నిమిషాలు కూడా క్రీజులో ఉండటం లేదు. 

మరో సచిన్, మరో సెహ్వాగ్ అవుతాడనుకున్న ముంబై బ్యాటర్ పృథ్వీ షా.. వారిలా అవుతాడో లేదో కాలం నిర్ణయిస్తుంది గానీ ఐపీఎల్  -16లో అతడి ప్రదర్శనలను చూస్తుంటే మాత్రం  అతడు మళ్లీ టీమిండియాలోకి రావాలంటే  మరో  యజ్ఞమే చేయాలనిపిస్తోంది.  అప్పుడెప్పుడో నాలుగేండ్ల క్రితం ఆస్ట్రేలియాతో   బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు వెళ్లి   ఆ తర్వాత బరువు పెరిగి, ఫామ్ తగ్గడంతో  బీసీసీఐ  ఈ ‘ఫ్యూచర్ సెహ్వాగ్’ ను పక్కనబెట్టింది. దీంతో మూడేండ్ల పాటు దేశవాళీలో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తే తప్ప సెలక్టర్లు కరుణించలేదు.  

గత రంజీ సీజన్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత   జనవరిలో న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు  జట్టులోకి వచ్చినా  అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు.  అయితే  టీమ్ లోకి రాకముందు  భారత జట్టు ఏదైనా సిరీస్ ఆడేముందు   టీమ్ ను ప్రకటించిన ప్రతీసారి  షా.. తన పేరు లేకపోయేసరికి  ‘అన్నీ ఆ సాయిబాబా చూస్తున్నాడు..’అని తన ఇన్‌స్టాగ్రామ్ లో స్టేటస్ లు పెట్టుకునేవాడు. 

సరే.. సాయిబాబా దయో  లేక షా  బ్యాటింగ్ ట్యాలెంటో గానీ టీమ్ లోకి వచ్చిన షా   తుది జట్టులో చోటు దక్కకపోయినా  ఐపీఎల్ లో మళ్లీ రాణించి  గిల్, ఇషాన్ ల ఓపెనింగ్ ప్లేస్ కు గట్టి పోటీనిస్తాడని అంతా భావించారు. ఐపీఎల్ లో మెరిస్తే  భారత జట్టులో చోటు దక్కడానికి  అవకాశం ఉంటుందని చాలా మంది యువ క్రికెటర్లు  వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంటే షా మాత్రం  నిర్లక్ష్యపు ఆటతో దారుణంగా విఫలమవుతున్నాడు.  

 

 

ఈ సీజన్ లో  ఇప్పటివరకు  ఐదు మ్యాచ్ లు ఆడిన షా  స్కోర్లు చూస్తే.. 12, 7, 0, 15, 0 గా ఉన్నాయి. మొత్తం కూడినా 34 పరుగులే.  ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాఫ్  సెంచరీల మీ ద  హాఫ్ సెంచరీలు బాదుతుంటే  షా మాత్రం  అలా వచ్చి ఇలా వెళ్లుతున్నాడు.  దీంతో  ట్విటర్ లో అతడిపై ట్రోలింగ్  తో నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.  షా కు తన స్టైల్ లోనే కౌంటర్ ఇస్తూ.. ‘అన్నీ సాయిబాబా చూస్తున్నాడు’అంటూ  ట్రోల్ చేస్తున్నారు.  ఈ దారుణ ఆటతీరుతో షా కు రాబోయే  మ్యాచ్ లలో ఢిల్లీ అతడికి ఛాన్స్ ఇస్తే అది అద్భుతమే  అని చెప్పడంలో  సందేహమే లేదు. ఇదే నిజమైతే భారత టీ20 జట్టులో కూడా షా ప్లేస్ మళ్లీ గోవిందా గోవిందా..! అతడు మళ్లీ టీమిండియాలోకి రావాలంటే  షిరిడీ సాయిబాబాకు   నిత్య పూజలు,  నిష్టగా మాలలు వేసుకుని ఉపవాసాలు  ఉంటూ యజ్ఞాలు  యాగాలు చేసినా   అనుమానమే..!

 

 

 

PREV
click me!

Recommended Stories

Rohit Sharma : షాకింగ్.. అసలు విషయం చెప్పిన రోహిత్!
కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?