ఏంది బ్రూక్ బ్రో పుసుక్కున అంత మాట అన్నావ్..? ఒక్క సెంచరీకే..!

Published : Apr 15, 2023, 04:15 PM ISTUpdated : Apr 15, 2023, 04:17 PM IST
ఏంది బ్రూక్ బ్రో పుసుక్కున అంత మాట అన్నావ్..? ఒక్క సెంచరీకే..!

సారాంశం

IPL 2023: ఐపీఎల్-16లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్  హ్యారీ బ్రూక్  శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్  తో మ్యాచ్ లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 

సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలనం, ఇంగ్లాండ్  యువ ఆటగాడు   హ్యారీ బ్రూక్  శుక్రవారం  కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో  దుమ్ముదులిపాడు.  గతేడాది డిసెంబర్ లో కొచ్చి వేదికగా ముగిసిన   ఐపీఎల్ మినీ వేలంలో  రూ. 13.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన హైదరాబాద్.. బ్రూక్ పై భారీ ఆశలు పెట్టుకోగా బ్రూక్ వాటికి న్యాయం చేశాడు. శుక్రవారం ఈడెన్ గార్డెన్ లో సెంచరీ  చేసిన తర్వాత  బ్రూక్..  మాట్లాడిన  మాటలు మాత్రం దుమారం రేపాయి.  తన ఆటతో  ఇండియన్ ఫ్యాన్స్ నోరు మూయించానని   బ్రూక్ చెప్పడం వివాదాస్పదమైంది. 

మ్యాచ్ ముగిసిన తర్వాత   ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికైన  బ్రూక్,  హర్షా భోగ్లేతో మాట్లాడుతూ.. ‘ఈడెన్ గార్డెన్ లో క్రౌడ్  చాలా బాగుంది.   నేను బ్యాటింగ్ చేసేప్పుడు వారి ఈలలు, గోలలు అన్నింటినీ ఆస్వాదించాను.   ఈ మ్యాచ్ లో నా మీద నేనే కాస్త ప్రెజర్ పెట్టుకున్నా.. 

వాస్తవానికి  ఇప్పుడు   సోషల్ మీడియాలో అందరూ నన్ను పొగుడుతున్నారు.   కానీ రెండ్రోజుల క్రితం ఇలా లేదు.  నామీద  జోకులు, ట్రోల్స్ తో తీవ్ర విమర్శలు చేశారు.  నేను పనికిరాని వాడినని, నా మీద పెట్టిన డబ్బులు వృథా అని  చాలా మంది ఇండియన్  ఫ్యాన్స్ నన్ను తిట్టిపోశారు. నేను నిజాయితీగా వారి నోళ్లు మూయించినందుకు గర్వంగా ఉంది..’అని చెప్పాడు. ఇంగ్లాండ్  క్రికెట్ కు మద్దతుగా ఉండే ఇంగ్లాండ్ బర్మీ  ఆర్మీ ఈ వీడియోను షేర్ చేస్తూ  వాళ్ల అహాన్ని  చూపెట్టింది.  

 

అయితే ఆడుతున్న తొలి సీజన్ లోనే భారత అభిమానులను ‘నోర్మూయించాను’ అని చెప్పడం వివాదాస్పదమైంది.   ఇండియాలో ఐపీఎల్ ఆడుతూ ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్   చేస్తే తదనంతర పరిణామాలు తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒక్క సెంచరీ కొట్టగానే   గొప్పోడివని అనుకోవద్దని..  నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.  200 మ్యాచ్ లు ఆడి 6 వేలకు పైగా పరుగులు చేసిన  కోహ్లీ, డేవిడ్ వార్నర్ లతో పాటు బట్లర్, మిల్లర్ వంటి  ఇతర దేశాల ప్లేయర్లను తమ కుటుంబంలా చూసుకుంటున్నామని.. వాళ్లే ఇంతవరకూ ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేయలేదని, ఒక్క సెంచరీతో కళ్లు నెత్తికెక్కినట్టు మాట్లాడొద్దరని హెచ్చరిస్తున్నారు.  

 

 

 

PREV
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !