IPL 2023, PBKS vs LSG: లక్నోతో పంజాబ్ పోరు.. టాస్ గెలిచిన కింగ్స్.. గబ్బర్ ఈజ్ బ్యాక్..

Published : Apr 28, 2023, 07:03 PM ISTUpdated : Apr 28, 2023, 07:21 PM IST
IPL 2023, PBKS vs LSG: లక్నోతో పంజాబ్ పోరు.. టాస్ గెలిచిన కింగ్స్.. గబ్బర్ ఈజ్ బ్యాక్..

సారాంశం

IPL 2023, PBKS vs LSG: ఐపీఎల్ - 2023 ఎడిషన్ లో  నేడు మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య 38వ లీగ్ మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 

ఐపీఎల్ -16 లో నేడు పంజాబ్ కింగ్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య  మ్యాచ్ జరుగుతున్నది. పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి ఫస్ట్  ఫీల్డింగ్ ఎంచుకుంది.  పంజాబ్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ తిరిగి జట్టుతో చేరాడు. ఇది  ఆ జట్టుకు  బలం చేకూర్చేదే. 

ఈ సీజన్ లో  లక్నో ఏడు మ్యాచ్ లు ఆడి  నాలుగు మ్యాచ్ లు గెలిచి 8  పాయింట్లతో పాయింట్ల పట్టికలో  నాలుగో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా ఏడు మ్యాచ్ లలో  నాలుగు గెలిచి   8 పాయింట్లు సాధించినా నెట్ రన్ రేట్ విషయంలో లక్నో  కాస్త బెటర్ గా ఉంది. 

ఇటీవలే ముంబై ఇండియన్స్ తో వాంఖెడే వేదికగా ముగిసిన  మ్యాచ్ లో  గెలిచి  జోరు మీదున్న పంజాబ్..  నేడు స్వంత గ్రౌండ్ లో జరుగుతున్న పోరులో సత్తా చాటాలని భావిస్తున్నది. ఈ మ్యాచ్ గెలిస్తే  ఆ జట్టు లక్నో, ఆర్సీబీలను వెనక్కినెట్టి  నాలుగో స్థానానికి చేరొచ్చు.   

ఇక  ఈనెల 19న  రాజస్తాన్ రాయల్స్ లో లోస్కోరింగ్ థ్రిల్లర్ లో గెలిచిన  లక్నో సూపర్ జెయింట్స్.. తర్వాత  స్వంత గ్రౌండ్ లో గుజరాత్ చేతిలో చావుదెబ్బతింది.   మరీ ముఖ్యంగా ఆ జట్టు సారథి  కెఎల్ రాహుల్  నెమ్మదైన ఆట లక్నోకు శాపంగా మారింది. రాహుల్ రాణిస్తున్నా అతడి స్ట్రైక్ రేట్ ఆందోళనకరంగా ఉంది. ఇది టీమ్ విజయాలపై దారుణంగా ప్రభావం చూపుతున్నది.  మరి నేటి మ్యాచ్ లో అయినా రాహుల్ తన స్ట్రైక్ రేట్ ను మెరుగుపర్చుకుంటాడా..? అన్నది  చూడాలి.  అదీగాక మొహాలీ గతంలో రాహుల్ కు హోంగ్రౌండ్. పంజాబ్ కింగ్స్ కు సారథిగా ఉన్నప్పుడు రాహుల్ ఇక్కడ  చాలా మ్యాచ్ లు ఆడాడు.  

పంజాబ్ జట్టులో లియామ్‌ లివింగ్‌స్టోన్‌ వచ్చినా  అతడు  గత రెండు మ్యాచ్ లలో ఆకట్టుకోలేదు. మాథ్యూ షార్ట్ కూడా విఫలమవుతున్నాడ. వికెట్ కీపర్ జితేశ్ శర్మ, షారుక్ ఖాన్ లు జోరుమీదుండటం ఆ జట్టుకు కలిసొచ్చేదే. సామ్ కరన్ కూడా టచ్ లోనే ఉన్నాడు. మరి  నేటి మ్యాచ్ లో వీళ్లంతా ఎలా రాణిస్తారనేది కీలకం.  

 

తుది జట్లు : 

పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్),  అథర్వ తైడే, సికందర్ రజా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్,  జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్, కగిసో రబడ, రాహుల్ చాహర్,గుర్‌మ్రీత్ బ్రర్, అర్ష్‌దీప్ సింగ్ 

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, నవీన్ ఉల్ హక్,  రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్ 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !
Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?