IPL 2023 MI vs DC: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... బోణీ కొట్టేది ఎవరు?...

Published : Apr 11, 2023, 07:04 PM ISTUpdated : Apr 11, 2023, 07:16 PM IST
IPL 2023 MI vs DC: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... బోణీ కొట్టేది ఎవరు?...

సారాంశం

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడిన మొదటి మూడు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్... తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్.. తొలి విజయం కోసం ఇరు జట్లు ఎదురుచూపు...

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది..

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడిన మొదటి మూడు మ్యాచుల్లో చిత్తుగా ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో 50 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది..

మరోవైపు ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా ఏ మాత్రం బాగోలేదు. తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతుల్లో 8 వికెట్ల తేడాతో ఓడిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ముంబై, ఈ సీజన్‌లో బోణీ కోసం ఎదురుచూస్తోంది..

రెండు జట్లూ తొలి విజయం కోసం ఎదురుచూస్తుండడంతో ఈ మ్యాచ్‌లో ఓ జట్టుకి బోణీ దక్కడం ఖాయం. అది ముంబైకి దక్కుతుందా? లేక ఢిల్లీ క్యాపిటల్స్‌కి దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.  ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.

మూడు మ్యాచుల్లో కలిపి 158 పరుగులు చేశాడు వార్నర్. అయితే డేవిడ్ వార్నర్‌కి ఢిల్లీ బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించడం లేదు. ముఖ్యంగా భారీ ఆశలు పెట్టుకున్న పృథ్వీ షా, మొదటి మూడు మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అలాగే బౌలర్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు..

ముంబైది కూడా ఇదే పరిస్థితి. గత మ్యాచ్‌లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మంచి ఆరంభం అందించినా మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ నుంచి సరైన ఇన్నింగ్స్‌లు రావడం లేదు. భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ కూడా ఫ్లాప్ అవుతున్నాడు...

బౌలింగ్‌లోనూ ముంబై కష్టాలు తీరడం లేదు. జస్ప్రిత్ బుమ్రా గాయంతో టీమ్‌కి దూరం కావడంతో బౌలింగ్ యూనిట్‌లో అనుభవ లేమి స్పష్టంగా కనబడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కి జోఫ్రా ఆర్చర్ దూరంగా ఉన్నాడు.  నేటి మ్యాచ్‌కి కూడా ఆర్చర్‌ని దూరంగా పెట్టింది ముంబై ఇండియన్స్...

ఖలీల్ అహ్మద్ గాయపడడంతో అతని ప్లేస్‌లో యష్ ధుల్‌కి అవకాశం ఇచ్చిన ఢిల్లీ, రిలే రొసో ప్లేస్‌లో ముస్తాఫిజుర్‌ రహాన్‌ని తీసుకొచ్చింది.

ముంబై ఇండియన్స్ టీమ్ ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నేహాల్ వదేరా, హృతిక్ హోకీన్, రిలే మెడరిత్, అర్షద్ ఖాన్, పియూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు ఇది: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీశ్ పాండే, పృథ్వీ షా, యష్ ధుల్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, ఆన్రీచ్ నోకియా, ముస్తాఫిజుర్ రహ్మాన్

PREV
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !