
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం అందుకుంది. సామ్ కుర్రాన్ 55, హర్‌ప్రీత్ సింగ్ 41 పరుగులు చేయడంతో పంజాబ్ కింగ్స్ 214 పరుగులు చేయగా ఈ భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 201 పరుగుకే పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ హాఫ్ సెంచరీలు చేసినా విజయాన్ని అందించలేకపోయారు.. దీంతో పంజాబ్‌పై పంజాబ్‌లోనే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది ముంబై ఇండియన్స్..
సీఎస్‌కేపై ఘన విజయం అందుకున్న పంజాబ్ కింగ్స్, ప్రస్తుతం 9 మ్యాచుల్లో 5 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. 8 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కింది స్థానంలో ఉంది. ఈ రెండు జట్లకి ఈ మ్యాచ్ గెలవడం చాలా అవసరం..
శిఖర్ ధావన్‌తో పాటు ప్రభుసిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేశ్ శర్మ బ్యాటుతో చక్కగా రాణిస్తున్నారు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో సికందర్ రజా కీలక ఇన్నింగ్స్ ఆడి విజయాన్ని అందించాడు..
మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 212 పరుగుల భారీ టార్గెట్‌ని ఛేదించిన ముంబై ఇండియన్స్ కూడా జోరు మీద ఉంది. అయితే రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ కూడా నిలకడగా పరుగులు చేయలేకపోతున్నారు..
మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్‌లపైనే ఎక్కువగా ఆధారపడింది ముంబై ఇండియన్స్. జోఫ్రా ఆర్చర్ గాయం నుంచి కోలుకున్నా, ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నాడు.
మరోవైపు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. సామ్ కుర్రాన్‌తో పాటు సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడా, రాహుల్ చాహార్, అర్ష్‌దీప్ సింగ్ అదరగొడుతున్నారు.. నేటి మ్యాచ్‌లో కగిసో రబాడాకి రెస్ట్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్, నాథన్ ఎల్లిస్‌కి అవకాశం ఇచ్చింది. రిలే మెడరిత్ గాయపడడంతో అతని స్థానంలో ఆకాశ్ మద్వాల్ అనే ఓ కొత్త బౌలర్‌కి అవకాశం కల్పించింది ముంబై ఇండియన్స్..
పంజాబ్ కింగ్స్ జట్టు ఇది: ప్రభుసిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, సామ్ కుర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహార్, ఆకాష్ దీప్ సింగ్
ముంబై ఇండియన్స్ జట్టు ఇది: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వదేరా, జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మద్వాల్, అర్షద్ ఖాన్