
ఐపీఎల్-16 లీగ్ దశ పోటీలు దాదాపు చివరిక అంకానికి చేరుకున్నా ఇంకా ప్లేఆఫ్స్ వెళ్లే టీమ్స్ పై అస్పష్టత వీడలేదు. ఏ జట్టు కూడా అధికారికంగా ఇంకా ప్లేఆఫ్స్ కు చేరలేదు. ఆ ఉత్కంఠకు నేడు కాస్త క్లారిటీ దక్కే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ తో వాంఖెడే వేదికగా గుజరాత్ టైటాన్స్ తలపడుతున్న మ్యాచ్ లో ఆ రెండు జట్లతో పాటు ప్లేఆఫ్స్ రేసులో ఉన్న పలు జట్ల భవితవ్యాన్ని తేల్చనుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న నేటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఈ సీజన్ లో ఆడిన 11 మ్యాచ్ లలో 8 గెలిచిన గుజరాత్ టైటాన్స్ నేటి మ్యాచ్ లో గెలిస్తే ఆ దిశగా అధికారికంగా నేటి రాత్రే ముందడుగు వేస్తుంది. మరోవైపు బెంగళూరుతో పోరులో గెలిచి అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చిన ముంబై కూడా ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది.
పరోపకారమా..?
ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడిన ముంబై ఆరు గెలిచి ఐదింట ఓడి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ లో గెలిస్తే ఆ జట్టు టాప్ -3కి చేరడంతో పాటు ప్లేఆఫ్స్ రేసులో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది. కానీ వాంఖెడేలో ఫలితం ముంబైకి వ్యతిరేకంగా వస్తే మాత్రం అది మొదటికే మోసం. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న లక్నో (11 పాయింట్లు), ఆర్సీబీ (10 పాయింట్లు), పంజాబ్ (10 పాయింట్లు) లు ముంబై ఓడాలని కోరుకుంటున్నాయి. ముంబై గెలిస్తే ఆ తర్వాత ఆ జట్టు ఆడే రెండు మ్యాచ్ లలో ఒక్కటి గెలిచినా ఆ జట్టుకే ప్లేఆఫ్స్ అవకాశాలుంటాయి. కానీ ముంబై ఓడితే మాత్రం.. పైన పేర్కొన్న మూడు జట్లకు (ఈ మూడింటికీ ఇంకా మూడు మ్యాచ్ లు ఆడే అవకాశం ఉంది. దాంతో మూడు గెలిచినా ఆరు పాయింట్లు (మొత్తంగా 16 పాయింట్లు ఖాతాలో వేసుకుంటే నెట్ రన్ రేట్ బాగున్న జట్లకు ప్లేఆఫ్స్ ఛాన్సెస్ ఉంటాయి) దక్కించుకోవచ్చు.
ప్రతీకారం..
ఈ సీజన్ లోనే గుజరాత్ - ముంబైల మధ్య ఏప్రిల్ 25న ఈ రెండు జట్ల మధ్య అహ్మదాబాద్ లో మ్యాచ్ జరుగగా ఈ పోరులో గుజరాత్ 55 పరుగుల తేడాతో ఓడింది. గుజరాత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 207 పరుగులు చేయగా ముంబై.. 20 ఓవర్లలో 152 పరుగులకే పరిమితమైంది. ఇందుకు బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తున్నది. ఈ మ్యాచ్ గెలిస్తే ముంబైకి ప్రతీకారంతో పాటు ఇతర జట్లకు ఝలక్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. మరి రోహిత్ గ్యాంగ్ ఏం చేసేనో..!
తుది జట్లు:
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, విష్ణు వినోద్, పియూష్ చావ్లా, జేసన్ బెహ్రన్‌డార్ఫ్, కుమార్ కార్తికేయ
ఇంపాక్ట్ సబ్: మధ్వల్, రమణ్‌దీప్, బ్రెవిస్
గుజారత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, నూర్ అహ్మద్
ఇంపాక్ట్ సబ్ : శుభ్‌మన్ గిల్, కెఎస్ భరత్. సాయి కిషోర్