IPL 2023: మళ్లీ గెలుపు బాట పట్టిన పంజాబ్.. లక్నోకు షాక్.. రజ సూపర్ ఇన్నింగ్స్..

Published : Apr 15, 2023, 11:36 PM IST
IPL 2023: మళ్లీ గెలుపు బాట పట్టిన పంజాబ్.. లక్నోకు  షాక్.. రజ సూపర్ ఇన్నింగ్స్..

సారాంశం

IPL 2023, LSG vs PBKS: ఐపీఎల్-16లో వరుస  ఓటములతో  డీలాపడ్డ పంజాబ్ మళ్లీ విజయాల బాట పట్టింది.    లక్నోతో జరిగిన  మ్యాచ్ లో  లాస్ట్ ఓవర్ లో  విజయాన్ని అందుకుంది. 

ఐపీఎల్  - 2023 సీజన్ లో పంజాబ్ కింగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఓటములకు ఫుల్ స్టాప్ పడింది.  లక్నోతో సూపర్ జెయింట్స్ తో లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ ‌‌లో ఆ జట్టు..  160 పరుగుల ఛేదనను విజయవంతంగా పూర్తి చేసింది.   పంజాబ్ కింగ్స్ బ్యాటర్ సికందర్ రజ  (41 బంతుల్లో   57, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)  రాణించడంతో  పాటు ఆఖర్లో షారుక్ ఖాన్  (10 బంతుల్లో 23 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులతో పంజాబ్ కు ఈ సీజన్ లో  మూడో విజయాన్ని అందించాడు. లక్నో నిర్దేశించిన లక్ష్యాన్ని పంజాబ్..   19.3 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి  ఛేదించింది.  బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై లక్నో బౌలర్లు  కట్టడి చేసినా  చివర్లో భారీగా పరుగులిచ్చుకుని విఫలమయ్యారు. లక్నోకు  ఈ సీజన్ లో ఇది రెండో పరాజయం. 

160 పరుగుల లక్ష్య ఛేదనలో  పంజాబ్‌కు   ఇన్నింగ్స్ మొదట్లోనే  డబుల్ స్ట్రోక్ తాకింది. ఆ జట్టు ఓపెనర్లు  అథర్వ  తైదే  (0), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (4) లు  విఫలమయ్యారు. ఐపీఎల్ లో లక్నో తరఫున ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న  యుధ్వీర్  సింగ్  ఈ ఇద్దరినీ  స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు పంపాడు.  

వన్ డౌన్ లో వచ్చిన  మాథ్యూ షార్ట్ (22 బంతుల్లో 34, 5 ఫోర్లు, 1 సిక్స్).. అవేశ్ ఖాన్ వేసిన  రెండో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి దూకుడుమీద కనిపించాడు. యుధ్వీర్ వేసిన ఐదో ఓవర్లో కూడా రెండు సార్లు బంతిని బౌండరీ లైన్ దాటించాడు. కృష్ణప్ప గౌతమ్ మేసిన   ఆరో ఓవర్లో   నాలుగో బాల్  ను లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన షార్ట్.. అదే ఓవర్లో ఆఖరి బంతికి     స్టోయినిస్ కు క్యాచ్ ఇచ్చాడు. తొలి పవర్ ప్లే ముగిసేసిరకి పంజాబ్..  3 వికెట్ల నష్టానికి  45 పరుగులు చేసింది. 

రజ సూపర్ ఇన్నింగ్స్.. 

పవర్ ప్లే తర్వాత  పంజాబ్ స్కోరు నెమ్మదించింది. సికిందర్ రజ.. హర్‌ప్రీత్  సింగ్ (22)  తో కలిసి వికెట్ కాపాడుకుంటూనే ఇన్నింగ్స్ ను నిర్మించే పనిలో పడ్డాడు.  ఈ ఇద్దరూ  నాలుగో వికెట్ కు 30 బంతుల్లో 30 పరుగులు జోడించారు.  కానీ హర్‌ప్రీత్ ను   కృనాల్.. 11వ ఓవర్లో ఔట్ చేశాడు. అతడే వేసిన  13వ ఓవర్లో  రజ.. రెండు బౌండరీలు,  ఒక ఫోర్ బాదాడు.  కెప్టెన్ సామ్ కరన్   (6) వచ్చినా అతడు ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు.  రవి బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో కరన్.. కృనాల్ చేతికి చిక్కాడు. ఆదుకుంటాడనుకున్న జితేశ్ శర్మ  (2) ను మార్క్ వుడ్ బౌల్డ్ చేశాడు.  

జితేశ్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన షారుక్ ఖాన్ .. వస్తూ  రాగానే  లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు.  జితేశ్ శర్మ ఔట్ కాకముందే   హాఫ్  సెంచరీ చేసి దూకుడుమీదే కనిపించాడు.  క్రీజులో షారుక్ - రజ కూడా ఉండటంతో  పంజాబ్ విజయం పై ధీమాగా ఉంది.  

ఆఖర్లో టెన్షన్.. 

అవేశ్ ఖాన్ వేసిన  17వ ఓవర్లో  చివరి బంతికి ఫోర్ కొట్టిన రజ.. రవి బిష్ణోయ్ వేసిన  18వ ఓవర్లో  భారీ షాట్ ఆడబోయి   డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ వద్ద   స్టోయినిస్ కు క్యాచ్ ఇచ్చాడు.  కానీ మార్క్ వుడ్ వేసిన  19వ ఓవర్లో షారుఖ్ ఓ సిక్స్ కొట్టగా  హర్‌ప్రీత  బ్రర్ (6) ఓ ఫోర్ కొట్టాడు.  రవి బిష్ణోయ్ వేసిన చివరి ఓవర్లో   మూడో బాల్ కు షారుక్.. బౌండరీ కొట్టి పంజాబ్ విజయాన్ని ఖాయం చేశాడు. 

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్  బ్యాటింగ్ చేసిన  లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20  ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి  159 పరుగులు చేసింది.  లక్నో సారథి కెఎల్ రాహుల్  (74) రాణించాడు. పంజాబ్ బౌలర్లలో  ఆ జట్టు కెప్టెన్ సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా  రబాడా  రెండు వికెట్లు పడగొట్టాడు.  

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?