రాణించిన రాహుల్.. స్లో పిచ్‌పై పంజాబ్ ఎదుట ఊరించే టార్గెట్..

Published : Apr 15, 2023, 09:27 PM IST
రాణించిన రాహుల్.. స్లో పిచ్‌పై పంజాబ్ ఎదుట ఊరించే టార్గెట్..

సారాంశం

IPL 2023: పంజాబ్ కింగ్స్ తో లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్  బ్యాటింగ్ లో చేతులెత్తేసింది. ఆ జట్టు ఓపెనర్, కెప్టెన్ కెఎల్ రాహుల్  మినహా మిగిలినవారు విఫలమయ్యారు. 

ఐపీఎల్-16లో  గత మ్యాచ్ లో ఆర్సీబీతో  200 టార్గెట్ ను అత్యద్భుతంగా  ఛేదించిన కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో  సూపర్ జెయింట్స్.. పంజాబ్ కింగ్స్ తో లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటింగ్ లో చేతులెత్తేసింది. ఆ జట్టు ఓపెనర్, కెప్టెన్ కెఎల్ రాహుల్  (56 బంతుల్లో74, 8 ఫోర్లు, 1 సిక్సర్)   18వ ఓవర్ దాకా క్రీజులో ఉన్నా  నిదానమే ప్రధానం అన్నట్టుగా ఆడాడు.   మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో  లక్నో  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.  స్లో వికెట్ అయిన  లక్నోపై ఈ లక్ష్యాన్ని ఛేదించడం కూడా అంత ఈజీ కాదు. మరి పంజాబ్ బ్యాటర్లు  ఏం చేస్తారో..?   

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన  లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు  శుభారంభమే అందించారు. ధాటిగా ఆడకపోయినా  కైల్ మేయర్స్  (23 బంతుల్లో 29, 1 ఫోర్, 3 సిక్సర్లు), కెఎల్ రాహుల్ తొలి వికెట్ కు  7.4 ఓవర్లలో 56 పరుగులు జోడించారు.   

నిలకడగా ఆడుతున్న ఈ జోడీని హర్‌ప్రీత్ బ్రర్ విడదీశాడు.  బ్రర్ వేసిన  8వ ఓవర్  నాలుగో బంతికి మేయర్స్  హర్‌ప్రీత్ సింగ్ కు క్యాచ్ ఇచ్చాడు.  వన్ డౌన్ లో వచ్చిన  దీపక్ హుడా (2)  ను సికందర్ రజ  9వ ఓవర్లో నాలుగో బాల్‌కు ఎల్బీగా ఔట్ చేశాడు.   అనంతరం క్రీజులోకి వచ్చిన  కృనాల్ పాండ్యా  (18) తో కలిసి రాహుల్ లక్నో ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. కానీ  10-15 ఓవర్ల మధ్య  పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో  లక్నో స్కోరు నెమ్మదించింది.  కృనాల్ తో కలిసి 35 బంతుల్లో  48 పరుగులు జతచేశాడు రాహుల్.  ఈ జోడీని  రబాడా విడదీశాడు. 

 

రబాడా వేసిన  15వ ఓవర్లో లక్నోకు డబుల్ షాక్ తాకింది. కృనాల్ ను ఔట్ చేసిన రబాడా.. ఆర్సీబీతో మ్యాచ్ లో  వీరబాదుడు బాదిన నికోలస్ పూరన్ (0) ను కూడా   పెవిలియన్ కు పంపాడు.  ఈ ఇద్దరి క్యాచ్ లు షారుఖ్ ఖాన్  అందుకున్నాడు. కృనాల్ క్యాచ్ ను  అందుకునే క్రమంలో  అతడు బౌండరీ లైన్ దాటినా.. బంతిని  గాల్లోకి ఎగరేసి మళ్లీ లోపలికి వచ్చి  క్యాచ్ అందుకున్న తీరు అమోఘం.  15 ఓవర్లకు లక్నో చేసిన స్కోరు  111-4 మాత్రమే. 

రాహుల్ చాహర్ వేసిన   14వ  ఓవర్లో  బౌండరీ ద్వారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న  రాహుల్..  ఆ తర్వాత కూడా బ్యాట్ ఝుళిపించలేదు. పూరన్ స్థానంలో వచ్చిన  మార్కస్ స్టోయినిస్ (15) రాహుల్ చాహర్ బౌలింగ్ లో రెండు భారీ సిక్సర్లు బాదినా సామ్ కరన్ వేసిన 18వ ఓవర్లో ఐదో బంతికి కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. సామ్ కరన్  వేసిన ఆఖరి ఓవర్లో కూడా  లక్నో రెండు వికెట్లు కోల్పోయింది. యుధ్వీర్ సింగ్ (0) ఇచ్చిన క్యాచ్ ను మరోసారి  షారుక్ ఖాన్ బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్నాడు.  
 

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన