IPL 2023: ఉత్కంఠ పోరులో లక్నోదే విజయం.. ముంబై ప్లేఆఫ్ ఛాన్సెస్ సంక్లిష్టం

Published : May 16, 2023, 11:39 PM ISTUpdated : May 16, 2023, 11:45 PM IST
IPL 2023: ఉత్కంఠ పోరులో లక్నోదే విజయం..  ముంబై ప్లేఆఫ్ ఛాన్సెస్ సంక్లిష్టం

సారాంశం

IPL 2023, LSG vs MI: ప్లేఆఫ్స్ రేసులో  మరో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య టప్ ఫైట్ ఆసక్తికరంగా ముగిసింది. ముంబై  - లక్నో మధ్య  లక్నో వేదికగా జరిగిన  కీలక పోరులో  లక్నోనే విజయం వరించింది. 

ఐపీఎల్-16 లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్ మధ్య  జరిగిన కీలకమైన ప్లేఆఫ్స్ రేసు పోరులో తప్పక గెలవాల్సిన మ్యాచ్ ను లక్నో గెలుచుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో  లక్ష్యానికి దగ్గరగా వచ్చిన ముంబై.. ఆఖర్లో విజయం ముందు బోల్తా కొట్టి  పరాజయం పాలైంది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన  178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో   ముంబై..  20 ఓవర్లలో  5  వికెట్లు కోల్పోయి 172   పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో   లక్నో ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. 

స్లో పిచ్ పై లక్ష్య ఛేదన కష్టమనుకున్నట్టుగానే  ముంబైకి ఆఖర్లో షాకులు తప్పలేదు.  ఇషాన్ కిషన్  (39 బంతుల్లో  59, 8 ఫోర్లు, 1 సిక్స్) కు తోడుగా  కెప్టెన్ రోహిత్ శర్మ (25 బంతుల్లో  37,  1 ఫోర్, 3 సిక్సర్లు).. శుభారంభాన్నిచ్చినా ఆఖర్లో టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 32 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా ముంబై మిడిలార్డర్ వైఫల్యంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. 

ఈ విజయంతో  పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్  మూడో   స్థానానికి ఎగబాకింది. లక్నోకు 13 మ్యాచ్ లలో ఇది  8వ విజయం. దీంతో ఆ జట్టు ఖాతాలో 15 పాయింట్లు చేరాయి. ఓటమితో ముంబై   నాలుగో స్థానానికి పరిమితమై  ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ముంబై తర్వాత మ్యాచ్ లో గెలవడంతో పాటు నాలుగో స్థానం  కోసం పోటీ పడుతున్న  ఆర్సీబీ, పంజాబ్ జట్ల ఫలితాలపై ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. 

ఇక లక్నో - ముంబై మ్యాచ్ విషయానికొస్తే.. 178 పరుగుల లక్ష్య ఛేదనను  ముంబై   ధాటిగానే ఆరంభించింది.   ఆ జట్టు ఓపెనర్లు ఇషాన్ కిషన్  తో పాటు  కెప్టెన్ రోహిత్ శర్మ .. ముంబైకి శుభారంభాన్నిచ్చారు.    ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు  9.4 ఓవర్లలో 90 పరుగులు  జోడించి విజయానికి పునాధి వేశారు. ఈ సీజన్ లో గత నాలుగైదు మ్యాచ్ లలో  డకౌట్ అవుతూ  క్రీజులో నిలవడానికే తంటాలు పడ్డ   రోహిత్ ఈ మ్యాచ్ లో మాత్రం ఆత్మవిశ్వాసంగా ఆడాడు. యశ్ ఠాకూర్ వేసిన  నాలుగో ఓవర్లో  ముందుకొచ్చి   మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. తర్వాత నవీన్ ఉల్ హక్ బౌలింగ్ లో కూడా   మరో సిక్సర్ బాదాడు.  మరో ఎండ్ లో కిషన్ కూడా  ధాటిగానే ఆడాడు. ఈ ఇద్దరి దూకుడుతో ముంబై స్కోరు పవర్ ప్లేలోనే  50 పరుగులు దాటింది. 

బ్రేక్ ఇచ్చిన బిష్ణోయ్ 

లక్ష్యం దిశగా దూసుకుపోతున్న ముంబై జోరుకు లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయ్  బ్రేక్ వేశాడు.  అతడు వేసిన పదో ఓవర్లో  నాలుగో బాల్  కు రోహిత్  లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద  దీపక్ హుడా క్యాచ్ పట్టడంతో  హిట్‌‌మ్యాన్ నిష్క్రమించాడు. ఆ మరుసటి ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా బౌలింగ్ లో  ఫోర్ కొట్టి  హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కూడా బిష్ణోయ్ వేసిన  12వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు  నవీన్ ఉల్ హక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

ముంబై భారీ ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్  యాదవ్  (7)  తో పాటు నెహల్ వధెరా (16) కూడా వెంటవెంటనే వెనుదిరిగారు.  చివరి  3 ఓవర్లో  ముంబై విజయానికి  39 పరుగులు అవసరం కాగా..  యశ్ ఠాకూర్ వేసిన  18వ ఓవర్లో 9  పరుగులే వచ్చాయి. ఈ ఓవర్లో విష్ణు వినోద్  (2) వికెట్ కోల్పోయింది ముంబై.  నవీన్ ఉల్ హక్ వేసిన  19వ ఓవర్లో  19 పరుగులొచ్చాయి.  ఈ ఓవర్లో డేవిడ్ రెండు సిక్సర్లు బాదాడు. 

ఇక ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి  11 పరుగులు అవసరమనగా.. కృనాల్, మోహ్సిన్ ఖాన్ కు బంతినిచ్చాడు. మోహ్సిన్ ఐదు పరుగులే ఇచ్చి లక్నోకు సూపర్ డూపర్ విక్టరీని అందించాడు.ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  లక్నో సూపర్ జెయింట్స్  నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి  177 పరుగులు చేసింది.   టాప్ - 3 బ్యాటర్లు విఫలమైనా  స్టోయినిస్  (89 నాటౌట్) రాణించడంతో   లక్నో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.   కృనాల్ పాండ్యా (49 రిటైర్డ్ హర్ట్) రాణించాడు. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?