IPL 2023 LSG vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో..

By Chinthakindhi RamuFirst Published Apr 1, 2023, 7:10 PM IST
Highlights

IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... 2021 సీజన్ తర్వాత కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది...

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2023 సీజన్ ఆడనుంది ఢిల్లీ క్యాపిటల్స్. మరోవైపు కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో గత సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన లక్నో సూపర్ జెయింట్స్, ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉంది..

ఐపీఎల్ 2023 వేలంలో నికోలస్ పూరన్‌ కోసం ఏకంగా రూ.16 కోట్లు పెట్టింది లక్నో సూపర్ జెయింట్స్. ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన పూరన్‌కి ఇంత ఖర్చు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఈసారి లక్నోలో పూరన్ పర్ఫామెన్స్‌పైనే అందరి దృష్టి పడనుంది..

సన్‌రైజర్స్ తరుపున అట్టర్ ఫ్లాప్ అయిన నికోలస్ పూరన్, రొమారియో షిఫర్డ్, ఈసారి లక్నో తరుపున ఆడబోతున్నారు. మరోవైపు ఢిల్లీ సారథి రిషబ్ పంత్ లేకపోవడంతో క్యాపిటల్స్ పర్పామెన్స్ ఎలా ఉంటుందోననేది హాట్ టాపిక్‌గా మారింది..

ఐపీఎల్ 2023 మినీ వేలంలో మనీశ్ పాండే, రిలే రసో, ఇషాంత్ శర్మ, ఫిలిప్ సాల్ట్‌, ముకేశ్ కుమార్‌లను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, వీరిని ఎలా వాడుతుందో చూడాలి. 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్‌తో గొడవ పడి కెప్టెన్సీ కోల్పోయిన డేవిడ్ వార్నర్, ఒకటిన్నర సీజన్ల తర్వాత ఐపీఎల్ 2023 సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు..

భారత టెస్టు టీమ్‌లో చోటు కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్, ఢిల్లీ క్యాపిటల్స్‌కి వికెట్ కీపర్‌గా వ్యవహరించబోతున్నాడు. అతని పర్ఫామెన్స్‌ బాగుంటే, రిషబ్ పంత్ ప్లేస్‌లో టీమ్‌కి టెస్టు వికెట్ కీపర్‌గా లక్కీ ఛాన్స్ కొట్టేయొచ్చు.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇది: కెఎల్ రాహుల్ (కెప్టెన్), కేల్ మేయర్స్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్యా, రవి భిష్ణోయ్, జయ్‌దేవ్ ఉనద్కట్, ఆవేశ్ ఖాన్, మార్క్ వుడ్ 

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలే రసో, సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఛేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్

click me!