IPL 2023, LSG vs CSK: లక్నో - చెన్నై మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. టాస్ ఆలస్యం

By Srinivas MFirst Published May 3, 2023, 3:08 PM IST
Highlights

IPL 2023, LSG vs CSK: లక్నోలోని అటల్ బిహారి వాజ్‌పేయి  ఏకనా స్టేడియంలో లక్నో  సూపర్ జెయింట్స్.. చెన్నై సూపర్ కింగ్స్  మధ్య జరగాల్సిన మ్యాచ్  కు వర్షం అంతరాయం కలిగిస్తున్నది. 

లక్నోలోని అటల్ బిహారి వాజ్‌పేయి  ఏకనా స్టేడియంలో లక్నో  సూపర్ జెయింట్స్.. చెన్నై సూపర్ కింగ్స్  మధ్య జరగాల్సిన మ్యాచ్  కు వర్షం అంతరాయం కలిగిస్తున్నది.  నేటి ఉదయం నుంచి ఇక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో టాస్ ఆలస్యమయ్యింది.  ప్రస్తుతానికి అక్కడ వర్షం లేకున్నా  ఉదయం నుంచి కురిసిన వాన వల్ల ఔట్ ఫీల్డ్ అంత తడిగా ఉంది. లక్నో సిబ్బంది ప్రస్తుతం దీనిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఆటగాళ్లు  అందరూ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నా టాస్ ఎప్పుడు వేస్తారనేది ఇంకా  క్లారిటీ లేదు. 

ఈ సీజన్ లో భాగంగా మే 3 నాటికి ఉన్న పాయింట్ల పట్టికలో   లక్నో, చెన్నైలు  9 మ్యాచ్ లు ఆడి ఐదు గెలిచి నాలుగింటిలో ఓడి   పది పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.  చెన్నై నెట్ రన్ రేట్ కంటే  లక్నో..  కాస్త మెరుగ్గా ఉంది. 

Latest Videos

 

Hello from Lucknow 👋🏻

The Toss has been delayed in the clash ☁️

Stay tuned for further updates. pic.twitter.com/8OhWUCBSWi

— IndianPremierLeague (@IPL)

లక్నో పిచ్  స్లో టర్నర్. ఇది స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. ఈ పిచ్ పై బ్యాటర్లు పరుగులు చేయడం కష్టం. గుజరాత్ - లక్నో మ్యాచ్ లో  హార్ధిక్ పాండ్యా సేన  136 పరుగులే చేసి విజయాన్ని సాధించింది. మొన్నటికి మొన్న   ఆర్సీబీ కూడా  125 మాత్రమే కొట్టి  విజయాన్ని అందుకుంది.  గత రెండు మ్యాచ్ లలో ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  జట్టు ఇక్కడ గెలిచింది.  మరి  రవీంద్ర జడేజా, మహీశ్ తీక్షణ, మోయిన్ అలీ వంటి స్పిన్నర్లు ఉన్న  చెన్నై..  ఈ పిచ్ ను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. 

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ను గాయాలు వేధిస్తున్నాయి. గత మ్యాచ్ లో గాయం కారణంగా కెఎల్ రాహుల్ ఇవాళ బెంచ్ కే పరిమితమయ్యాడు. మిగతా పిచ్ ల మీద   బాగా ఆడుతున్న  లక్నో బ్యాటర్లు.. స్వంత పిచ్ లో మాత్రం తేలిపోతున్నారు. కైల్ మేయర్స్, బదోని, స్టోయినిస్, పూరన్ వంటి బ్యాటర్లు ఉన్నా  ఛేదనలో 130  స్కోరు చేయలేక తంటాలు పడుతున్నారు.  నేటి మ్యాచ్ లో కూడా ఇదే వైఫల్యం  రిపీట్ అయితే  ఆ జట్టు  పాయింట్ల పట్టికలో టాప్ - 4 లో ప్లేస్ కోల్పోయే ప్రమాదముంది. 

click me!