మరో ఘనత అందుకున్న రాహుల్.. ఆ విషయంలో గేల్, కోహ్లీలు కూడా అతడి తర్వాతే..

Published : Apr 16, 2023, 04:16 PM IST
మరో ఘనత అందుకున్న రాహుల్.. ఆ విషయంలో గేల్, కోహ్లీలు కూడా అతడి తర్వాతే..

సారాంశం

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లక్నో సూపర్ జెయింట్స్  కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో ఘనత అందుకున్నాడు.  గేల్, కోహ్లీల రికార్డులను బ్రేక్ చేశాడు. 

లక్నో సూపర్ జెయింట్స్ సారథి  కేఎల్ రాహుల్  ఐపీఎల్ లో మరో ఘనత అందుకున్నాడు.  ఐపీఎల్  లో 4 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా  అందుకున్న బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. గతంలో   వెస్టిండీస్ వీరుడు  క్రిస్ గేల్,  ఆర్సీబీ మాజీ  ఆటగాడు  డివిలియర్స్,  టీమిండియా మాజీ సారథి  విరాట్ కోహ్లీలు కూడా   ఈ జాబితాలో రాహుల్ కంటే వెనుకే ఉన్నారు. 

పంజాబ్ కింగ్స్ తో  శనివారం ముగిసిన మ్యాచ్ లో  రాహుల్ ఈ ఘనత సాధించాడు.   ఈ మ్యాచ్ లో రాహుల్  తన వ్యక్తిగత స్కోరు  30 పరుగులు దాటగానే  ఐపీఎల్ లో  105 ఇన్నింగ్స్ లలోనే 4 వేల పరుగులు దాటిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 

రాహుల్ కంటే ముందు ఈ ఘనత సాధించినవారిలో క్రిస్ గేల్ ముందున్నాడు. గేల్.. 112 ఇన్నింగ్స్ లలో 4 వేల పరుగుల మైలురాయిని అందుకోగా   డేవిడ్ వార్నర్  114 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించాడు.  ఆర్సీబీ మాజీ సారథి  విరాట్ కోహ్లీ.. 128 ఇన్నింగ్స్ లలో  4 వేల పరుగుల క్లబ్ లో చేరగా..  ఏబీ డివిలియర్స్.. 131 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను అందుకున్నాడు.  

 

కాగా రాహుల్ పేరిట ఐపీఎల్ లో అత్యంత వేగంగా  3 వేల పరుగుల మైలురాయిని చేరిన ఘనత కూడా ఉంది.  అతడు  80 ఇన్నింగ్స్ లలోనే  3 వేల పరుగులు చేశాడు.  అంతేగాక ఐపీఎల్ లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు చేసిన  తొలి బ్యాటర్ గా (60 ఇన్నింగ్స్ లలో)  ఉన్నాడు.  గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (63 ఇన్నింగ్స్) పేరిట ఉండేది.  

ఐపీఎల్ లో 2013లో ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. ఇప్పటివరకు నాలుగు ఫ్రాంచైజీలు మారాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున 2013 లో ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. ఆ తర్వాత  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు. 2018 నుంచి పంజాబ్ కు ఆడాడు.  2022 సీజన్ కు ముందు లక్నో సూపర్  జెయింట్స్  లో చేరి ఆ జట్టు తరఫున ఆడుతున్నాడు. కాగా నిన్నటి మ్యాచ్ లో  లక్నో.. పంజాబ్ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.

 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !