వార్నర్, డుప్లెసిస్ రికార్డులు బ్రేక్ చేసిన బట్లర్.. ఐపీఎల్‌లో మరో ఘనత సొంతం

By Srinivas MFirst Published Apr 12, 2023, 10:12 PM IST
Highlights

IPL 2023: ఐపీఎల్ లో   రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్   జోస్ బట్లర్ రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు.  బరిలోకి దిగితే బాదడమే లక్ష్యంగా పెట్టుకున్న అతడు.. చెన్నైతో మ్యాచ్ లో మరో రికార్డు  సాధించాడు.

రాజస్తాన్ రాయల్స్   ఓపెనర్ జోస్ బట్లర్  ఐపీఎల్ లో  తన  ఫామ్ కొనసాగిస్తున్నాడు.   బరిలోకి దిగితే బంతిని బాదడమే లక్ష్యంగా ఆడుతున్న ఈ ఇంగ్లాండ్  వైట్ బాల్ కెప్టెన్..  ఆప్పటికే  ఈ సీజన్ లో నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడినా  మూడు హాఫ్ సెంచరీలతో రాణించాడు.  చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో    17 పరుగులకు చేరుకోగానే అతడు  ఐపీఎల్ లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

కాగా  ఐపీఎల్ లో మూడు వేల పరుగులు సాధించిన  21 వ బ్యాటర్ బట్లర్. కానీ ఈ ఘనతను అత్యంత వేగంగా అందుకున్న  బ్యాటర్ల జాబితాలో మాత్రం మూడో స్థానంలో నిలిచాడు. మూడు వేల పరుగులు చేరడానికి  బట్లర్ కు 85 ఇన్నింగ్స్ అవసరం అయ్యాయి.  

Latest Videos

ఈ క్రమంలో  బట్లర్  డేవిడ్ వార్నర్  (94 ఇన్నింగ్స్), ఫాఫ్ డుప్లెసిస్ (94 ఇన్నింగ్స్) ల రికార్డులను బ్రేక్ చేశాడు.  ఐపీఎల్ లో అత్యంత వేగంగా  3 వేల  పరుగులు  సాధించినవారిలో  క్రిస్ గేల్ అందరికంటే ముందున్నాడు. గేల్.. 75 ఇన్నింగ్స్ లలో  3 వేల పరుగుల మార్క్ ను అందుకున్నాడు. ఆ తర్వాత  కెఎల్ రాహుల్.. 80 ఇన్నింగ్స్ లలో  ఈ ఘనతను సాధించాడు. ఈ ఇద్దరి తర్వాత   స్థానం బట్లర్ దే కావడం గమనార్హం.  

 

Love you 3000, Jos! 💗 pic.twitter.com/8Edhf9AhFy

— Rajasthan Royals (@rajasthanroyals)

ఐపీఎల్ లో బట్లర్  2016లో ఎంట్రీ ఇచ్చాడు.  తొలి రెండు సీజన్లు ముంబై ఇండియన్స్ కు ఆడాడు   2018 నుంచి రాజస్తాన్ కు ఆడుతున్న  బట్లర్..    ప్రతీ సీజన్ లో రాటుదేలుతున్నాడు.    2022 సీజన్ లో అయితే అతడు  ఏకంగా 863 పరుగులు చేసి  ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఆడి 204 పరుగులు చేశాడు.  ఆరెంజ్ క్యాజ్ జాబితాలో  ధావన్  (225), వార్నర్ (209)తో బట్లర్ (204) కూడా పోటీ పడుతున్నాడు.  

మొత్తంగా  బట్లర్  ఐపీఎల్ లో ఇప్పటివరకు 86 మ్యాచ్ లలో   3,035 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చెన్నైతో చెపాక్ లో  జరుగుతున్న మ్యాచ్ లో బట్లర్..  36 బంతుల్లో  1 ఫోర్, 3 సిక్సర్ల సాయంతో  52 పరుగులు చేశాడు.  బట్లర్ కు తోడు  పడిక్కల్ (38), అశ్విన్ (30), హెట్మెయర్ (30) లు రాణించడంతో   రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి  175 పరుగులు చేసింది.  

 

3 fifties in 4 games for Boss Buttler. 💗 pic.twitter.com/vlb978Za6h

— Rajasthan Royals (@rajasthanroyals)
click me!