చెపాక్‌లో ధోనికి సన్మానం.. తాలా 200వ గేమ్‌కు ముందు ఘనంగా సత్కరించిన శ్రీనివాసన్

By Srinivas MFirst Published Apr 12, 2023, 7:53 PM IST
Highlights

IPL 2023:  చెన్నై  సూపర్ కింగ్స్ సారథి   మహేంద్ర సింగ్ ధోనికి నేడు ఐపీఎల్ లో అరుదైన గౌరవం దక్కింది. రాజస్తాన్ రాయల్స్ తో  మ్యాచ్  ధోనికి సీఎస్కే కెప్టెన్ గా  200వ మ్యాచ్. 

ఐపీఎల్ ల  చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ లీగ్ లో  200 మ్యాచ్ లకు సారథిగా వ్యవహరించిన తొలి కెప్టెన్ గా  రికార్డు పుటలకెక్కాడు.   2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ధోని.. అప్పట్నుంచి నిరాటంకంగా  సీఎస్కే సారథిగా  వ్యవహరిస్తున్నాడు. 200వ మ్యాచ్ సందర్భంగా ధోనిని  చెన్నై సూపర్ కింగ్స్  యజమాని  శ్రీనివాసన్   ఘనంగా సత్కరించాడు.  
 
చెన్నై - రాజస్తాన్ మ్యాచ్ కు ముందు   చెపాక్ కు వచ్చిన  శ్రీనివాసన్.. ధోనికి   జ్ఞాపికను బహుకరించాడు.   ఈ సందర్భంగా   అప్పటికే అక్కడికి చేరుకున్న సీఎస్కే అభిమానులు ధోని నామస్మరణతో చెపాక్  హోరెత్తింది. ఈ కార్యక్రమానికి   శ్రీనివాసన్ భార్య  చిత్ర శ్రీనివాన్, కూతురు రూపా గురునాథ్ కూడా హాజరయ్యారు.

 

Congratulations to 👏

A huge moment in front of the fans 🙌 | | pic.twitter.com/Ex8fVDWydH

— IndianPremierLeague (@IPL)

Latest Videos

కాగా ఒక జట్టుకు  200 మ్యాచ్ లలో సారథిగా వ్యవహరించడం ఐపీఎల్ చరిత్రలో ఇదే ప్రథమం. 2008 నుంచి  సీఎస్కేకు ఆడుతున్న ధోని.. 2010, 2011, 2018, 2021 లలో  ఆ జట్టుకు  ట్రోఫీలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.   2016,  2017 సీజన్ లలో  చెన్నై సూపర్ కింగ్స్ పై నిషేధం కారణంగా ఆ రెండేండ్లు  ధోని..  రైజింగ్  పూణె సూపర్ జెయింట్స్ కు ఆడాడు.   ఆ రెండేండ్లు మినహాయిస్తే  2008 నుంచి ఇప్పటిదాకా ధోని.. ఐపీఎల్ లో తన సేవలను సీఎస్కేకు ధారపోశాడు. 

కాగా  రాజస్తాన్ తో చెపాక్ వేదిగకా జరుగుతున్న మ్యాచ్ లో  సీఎస్కే తొలుత  టాస్ గెలిచి ఫీల్డింగ్ కు వచ్చింది.  గత మ్యాచ్ లో  ఆడని  మోయిన్ అలీ  తో పాటు ఇటీవలే   న్యూజిలాండ్ సిరీస్  ముగించుకుని  వచ్చిన లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ కూడా ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు. దీపక్ చాహర్ స్థానంలో  ఆకాశ్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. 

 

Oh captain, our captain! 🦁 pic.twitter.com/FXjN7UjbDy

— Chennai Super Kings (@ChennaiIPL)

తుది జట్లు : 

చెన్నై సూపర్ కింగ్స్ :   రుతరాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మోయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోని (కెప్టెన్), సిసంద మగల, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్ 

రాజస్తాన్ రాయల్స్ : యశస్వి  జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్మెయర్, ఆర్. అశ్విన్, జేసన్ హోల్డర్, కుల్దీప్  సేన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్ 
 

click me!