ఆరంభం అదుర్స్.. మిడిల్ ఓవర్స్ లో నెమ్మదించిన రాజస్తాన్.. చెన్నైకి ఈ లక్ష్యం సరిపోతుందా..?

By Srinivas MFirst Published Apr 12, 2023, 9:16 PM IST
Highlights

IPL 2023 CSK vs RR: చెన్నైలోని చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్తాన్  రాయల్స్ బ్యాటర్లు  రాణించడంతో  ధోని సేన ముందు పోరాడగలిగే  లక్ష్యాన్ని నిలిపింది. 

చెన్నై సూపర్ కింగ్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య  చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో   తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్  ఆరంభం అదిరినా తర్వాత  స్పిన్నర్లు కట్టడి చేయడంతో  భారీ స్కోరు చేయలేకపోయింది. జోస్ బట్లర్ (36 బంతుల్లో  52, 1 ఫోర్, 3 సిక్సర్లు), దేవదత్ పడిక్కల్  (26 బంతుల్లో 38, 5 ఫోర్లు)  బాదినా మిడిల్ ఓవర్స్ లో చెన్నై స్పిన్నర్లు  కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి  రాజస్తాన్ ను అడ్డుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్.. 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. మరి చెన్నై కెప్టెన్ గా 200 వ మ్యాచ్ ఆడుతున్న  ధోని అండ్ కో. చెపాక్ లో  ఈ సీజన్  లో రెండో విజయాన్ని నమోదు చేస్తుందా..? 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన  రాజస్తాన్  రాయల్స్ ఓపెనర్  యశస్వి జైస్వాల్   (8 బంతుల్లో 10, 2 ఫోర్లు) ఆకాశ్ సింగ్  వేసిన తొలి ఓవర్లోనే రెండు బౌండరీలు కొట్టాడు.  కానీ తుషార్ దేశ్‌పాండే వేసిన  రెండో ఓవర్లో నాలుగో బంతిని పుల్ చేయబోయి  మిడాఫ్ వద్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

Latest Videos

పడిక్కల్ - బట్లర్ షో.. 

12 పరుగులకే తొలి వికెట్ పడ్డా  రాజస్తాన్  స్కోరు బోర్డు పవర్  ప్లేలో పరుగులు పెట్టిందంటే దానికి కారణం బట్లర్ - దేవదత్  పడిక్కల్  దూకుడుగా ఆడటం వల్లే. వన్ డౌన్ లో వచ్చిన పడిక్కల్.. తీక్షణ వేసిన   మూడో ఓవర్లోనే రెండు  బౌండరీలు కొట్టాడు. అతడే వేసిన  ఐదో ఓవర్లో బట్లర్ ఫోర్, సిక్సర్ బాదాడు. తుషార్ వేసిన  ఆరో ఓవర్లో పడిక్కల్ రెండు సార్లు బంతిని బౌండరీ దాటించాడు.  పవర్ ప్లే ముగిసేసరికి  ఒక వికెట్ నష్టానికి  57 పరుగులు చేసింది. 

బ్రేక్ ఇచ్చిన జడ్డూ.. 

ధాటిగా ఆడుతున్న ఈ జోడీని జడేజా విడదీశాడు.  జడ్డూ వేసిన  9వ ఓవర్లో పడిక్కల్.. కాన్వే కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఓవర్లో   జడ్డూ.. సంజూ శాంసన్   (0) ను కూడా ఔట్ చేశాడు.  

 

Ja-mbavan of a player 🔥 🦁💛 pic.twitter.com/lRWIn8Y13w

— Chennai Super Kings (@ChennaiIPL)

శాంసన్ స్థానంలో వచ్చిన అశ్విన్  (22 బంతుల్లో 30, 1 ఫోర్, 2 సిక్సర్లు)  తో కలిసి  బట్లర్ ఇన్నింగ్స్ నిర్మించాడు. స్పిన్నర్ల రంగ ప్రవేశంతో  రాజస్తాన్ స్కోరు వేగం తగ్గింది.  13 ఓవర్లకు రాజస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది.  ఆ క్రమంలో ఆకాశ్ సింగ్ వేసిన  15వ ఓవర్లో  అశ్విన్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. కానీ ఇదే ఓవర్లో ఆఖరి బంతికి  మగలకు క్యాచ్ ఇచ్చాడు. తొలుత ధాటిగా ఆడిన బట్లర్ తర్వాత నెమ్మదించాడు. 33 బంతుల్లో అతడి హాఫ్ సెంచరీ పూర్తయింది.  మోయిన్ అలీ వేసిన   17వ ఓవర్లో  రెండో బంతికి అతడు బౌల్డ్ అయ్యాడు.   

చివర్లో వచ్చిన షిమ్రన్ హెట్మెయర్  (18 బంతుల్లో 30, 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో  రాజస్తాన్ స్కోరు 175కు చేరింది. చెన్నై బౌలర్లలో ఆకాశ్, తుషార్, జడేజాలు తలా రెండు వికెట్లు తీశారు. 

click me!