
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఏప్రిల్ 30న జరిగిన రెండు మ్యాచుల్లో కలిపి 800+ పరుగులు వచ్చేశాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు. ఐపీఎల్ 999వ, 1000వ మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కి ఫుల్లు మజాని అందించాయి. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి గెలవగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ముంబై చివరి ఓవర్‌లో గెలిచింది..
ఆఖరి ఓవర్‌లో ముంబై ఇండియన్స్ విజయానికి 17 పరుగులు కావాల్సి వచ్చాయి. జాసన్ హోల్డర్ వేసిన ఆఖరి ఓవర్‌లో మూడు బంతులు కూడా ఫుల్ టాస్ వేయడం, వాటిని టిమ్ డేవిడ్ సిక్సర్లుగా మలచడంతో మరో 3 బంతులు ఉండగానే ముంబై గెలిచింది, ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది.
అయితే ఈ మ్యాచ్ సమయంలో రోహిత్ శర్మ అవుట్ విషయంలో వివాదం రేగింది. సందీప్ శర్మ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆఫ్ స్టంప్ కంటే ముందు లెగ్ స్టంప్ పైన బెయిల్ లైట్ రావడంతో సంజూ శాంసన్ గ్లవ్స్ తాకడం వల్లే బెయిల్స్ లేచాయని, రోహిత్ బౌల్డ్ కాలేదని వాదించారు కొందరు హిట్ మ్యాన్ ఫ్యాన్స్..
సంజూ శాంసన్‌ని ఛీటర్ అంటూ నానా మాటలు అంటూ నిందలు వేశారు. రోహిత్ శర్మ అవుట్ విషయంలో వివాదం రేగడంతో ఐపీఎల్, ఈ అవుట్‌కి సంబంధించి క్లియర్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో సందీప్ శర్మ వేసి బాల్, క్లియర్‌గా వికెట్లను పైకి లేపి సంజూ శాంసన్ గ్లవ్స్‌లోకి వెళ్లడం కనిపించింది..
సైడ్ యాంగిల్ కూడా చూపించడంతో సంజూ శాంసన్ గ్లవ్స్‌కి బెయిల్స్‌కి మధ్య చాలా గ్యాప్ ఉన్నట్టు తేలిపోయింది. సంజూ శాంసన్ గ్లవ్స్ తాకడం వల్లే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడని అతన్ని అవమానించి, అనుమానించిన హిట్ మ్యాన్ ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు..
బర్త్ డే రోజున ఐపీఎల్‌లో ఎప్పుడూ 20 పరుగులు కూడా చేయలేకపోయాడు రోహిత్ శర్మ. 2009లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున పుట్టినరోజున జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. ఇప్పటికీ రోహిత్ బర్త్ డేన అదే అత్యధిక స్కోరు..
2014లో 5 బంతులాడి 1 పరుగు చేసిన రోహిత్ శర్మ, 2022లో 5 బంతులాడి 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నేటి మ్యాచ్‌లో 5 బంతులాడి 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
దీనికి ముందు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేసి అర్షద్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే టీవీ రిప్లైలో బంతి, నడుముపైకి వస్తున్నట్టు క్లియర్‌గా కనిపించింది.