Shubman Gill: గిల్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా గుజరాత్ టైటాన్స్

Published : May 15, 2023, 09:11 PM IST
Shubman Gill: గిల్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా గుజరాత్ టైటాన్స్

సారాంశం

IPL 2023: సన్ రైజర్స్   హైదరాబాద్ తో  అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు. 

టీమిండియా ఓపెనర్, ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న  శుభ్‌మన్ గిల్  ఈ లీగ్ లో తొలి సెంచరీ  నమోదుచేశాడు.  సన్ రైజర్స్ హైదరాబాద్ తో  అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో  గిల్..  56 బంతుల్లోనే  13 బౌండరీలు, 1  సిక్సర్ సాయంతో  100 పరుగులు  చేసి తన కెరీర్ లో బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. గిల్ సెంచరీతో  గుజరాత్ భారీ స్కోరు దిశగా  దూసుకుపోతున్నది. 18 ఓవర్లు ముగిసేసరికి  5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 

ఐపీఎల్ లోకి  2018లో ఎంట్రీ ఇచ్చిన గిల్..  నాలుగు సీజన్ల పాటు   కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడాడు.   2022 కు ముందు గుజరాత్ కు మారిన  గిల్ ఆ సీజన్ లో  16 మ్యాచ్ లలో  483 పరుగులు చేశాడు.  

ఈ క్రమంలో అతడికి సెంచరీ చేసే అవకాశం ఒకసారి వచ్చింది.  కానీ  96 పరుగుల వద్దే ఆగిపోయిన  గిల్.. ఈ సీజన్ లో కూడా  లక్నోతో మ్యాచ్ లో  94 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.   కానీ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో దూకుడుగా ఆడి   సెంచరీ   కొరతను తీర్చుకున్నాడు.   

 

ఈ సెంచరీ ద్వారా అతడు గుజరాత్ టైటాన్స్ తరఫున ఫస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. కాగా ఈ ఏడాది గిల్.. వన్డేలలో డబుల్ సెంచరీ, టెస్టులలో సెంచరీ, టీ20లలోనూ  సెంచరీ చేసిన విషయం తెలిసిందే.  ఇప్పుడు ఐపీఎల్ లో కూడా  గిల్  సెంచరీతో కదం తొక్కడం విశేషం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు