ఐపీఎల్... చెన్నై అభిమాని డ్యాన్స్ కి చీర్ లీడర్స్ ఫిదా..!

Published : May 15, 2023, 04:39 PM IST
ఐపీఎల్... చెన్నై అభిమాని డ్యాన్స్ కి చీర్ లీడర్స్ ఫిదా..!

సారాంశం

తమ అభిమాన జట్టు, క్రికెటర్ ని ఉత్సాహ పరిచేందుకు అభిమానులు పొడియంలోకూర్చొని ఇలాంటివి చేయడం సర్వసాధారణం.

ఐపీఎల్ 16 హుషారుగా సాగుతోంది. అన్ని జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. ప్లే ఆఫ్ కి చేరుకునేందుకు కీలక టీమ్స్ పోటాపోటీగా ప్రదర్శన ఇస్తూ, అభిమానులను అలరిస్తున్నాయి. కొత్తగా జట్టులోకి వచ్చిన క్రికెటర్లు సైతం తమ ఆటతో అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తున్నారు. కాగా, ఈ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డారు. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్ సమయంలో ఓ చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. తమ అభిమాన జట్టు, క్రికెటర్ ని ఉత్సాహ పరిచేందుకు అభిమానులు పొడియంలోకూర్చొని ఇలాంటివి చేయడం సర్వసాధారణం.

 

దాదాపు అందరూ అరవడం, ప్లకార్డులు చూపించడం లాంటివి చేస్తారు. కానీ ఈ అభిమాని మాత్రం ఏకంగా డ్యాన్స్ చేశాడు. అతని డ్యాన్స్ కి ఇంప్రెస్ అయిన చీర్ లీడర్స్ కూడా సేమ్ స్టెప్స్ వేయడం విశేషం. అతనిని చూస్తూ.. అతను వేసిన స్టెప్స్ ని వీరు కూడా కాపీ చేశారు. దీనిని కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా. నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియోకి 11.4 మిలియన్ల వ్యూస్, వేల సంఖ్యలో కామెంట్స్ రావడం విశేషం. కొరియోగ్రాఫర్ అంటూ ఆ అభిమానిని అభినందిస్తున్నారు. అతని డ్యాన్స్ కి నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. సూపర్ డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?