IPL 2023: అన్నాదమ్ముల బస్తీ మే సవాల్.. లక్నో‌-గుజరాత్ మ్యాచ్‌లో అరుదైన దృశ్యం.. టాస్ గెలిచిన కృనాల్

Published : May 07, 2023, 03:03 PM ISTUpdated : May 07, 2023, 03:13 PM IST
IPL 2023: అన్నాదమ్ముల బస్తీ మే సవాల్.. లక్నో‌-గుజరాత్ మ్యాచ్‌లో అరుదైన  దృశ్యం.. టాస్ గెలిచిన కృనాల్

సారాంశం

IPL 2023, GT vs LSG: ఐపీఎల్-16 రెండో దశ  చివరి అంకానికి తెరలేచింది. ఇప్పుడు జట్లన్నీ రివేంజ్ తో పాటు  ప్లేఆఫ్స్ మీద దృష్టి సారించాయి. నేడు కూడా ఐపీఎల్ లో ఇలాంటి పోరే జరుగనుంది. 

ఐపీఎల్-16లో  గతవారం నుంచి జరుగుతున్న మ్యాచ్ లను ‘రైవల్రీ వీక్ ’గా అభివర్ణిస్తున్నారు  అభిమానులు. ఈ సీజన్ కొత్తలో  ‘ఢీ’కొన్న  వివిధ ఫ్రాంచైజీలు ఇప్పుడు రెండోసారి  తలపడుతున్నాయి.   అప్పుడు  ఓడిన జట్లు ఇప్పుడు వాటిపై బదులు తీర్చుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో నేడు మరో ఆసక్తికర పోరు జరుగనుంది.  అహ్మదాబాద్ వేదికగా అన్నాదమ్ముల సవాల్ కు తెరలేవనుంది.  ఈ పోరులో కృనాల్ పాండ్యా సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్  జట్టు టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. హార్ధిక్ పాండ్యా   నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. 

ఈ సీజన్ లో  ఈ రెండు జట్ల మధ్య    ఏప్రిల్ 22న  ఫస్ట్ ఫైట్ జరిగింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా  సాగిన ఈ మ్యాచ్ లో  గుజరాత్ ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.   స్లో టర్నర్ అయిన లక్నో పిచ్ పై గుజరాత్ 135 పరుగులు చేయగా  లక్నో సూపర్ జెయింట్స్.. 128 పరుగులకే పరిమితమైంది. 

రెగ్యులర్ కెప్టెన్ కెఎల్  రాహుల్ కు గాయంతో  కృనాల్ పాండ్యా  లక్నోకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఐపీఎల్ లో ఇరు జట్లకు వేర్వేరుగా, ఆటగాళ్లుగా ఆడిన  అన్నదమ్ముల కంటే కెప్టెన్లుగా ప్రాతినిథ్యం వహించిన తొలి బ్రదర్స్ గా హార్ధిక్ పాండ్యా - కృనాల్ పాండ్యాలు అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఐపీఎల్  చరిత్రలో అన్నాదమ్ములు  ఇరు జట్లకు సారథులుగా వ్యవహరించడం ఇదే ప్రథమం. 

కాగా పాయింట్ల పట్టికలో  గుజరాత్ టైటాన్స్ ..  10 మ్యాచ్ లలో ఏడు గెలిచి  14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.  లక్నో సూపర్ జెయింట్స్ 10 మ్యాచ్ లలో ఐదు గెలిచి  నాలుగు ఓడి 11 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ ఓడినా గుజరాత్ టాప్  ప్లేస్ కు  వచ్చిన నష్టమేమీ లేదు.  దీంతో ఆ జట్టు  మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం కూడా ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి ప్లేఆఫ్స్ కు మరింత దగ్గరవ్వాలని ఆ జట్టు భావిస్తున్నది. 

 

తుది జట్లు : 

గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా,  విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ 

లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డికాక్, కైల్ మేయర్స్, దీపక్ హుడా,  కరణ్ శర్మ,  కృనాల్ పాండ్యా,  (కెప్టెన్), మార్కస్   స్టోయినిస్,  స్వప్నిల్ సింగ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్, అవేశ్ ఖాన్ 

 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !