ఆర్‌సీబీపై రివెంజ్ తీర్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... వరుస విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు కాపాడుకుంటూ...

Published : May 06, 2023, 11:02 PM IST
ఆర్‌సీబీపై రివెంజ్ తీర్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... వరుస విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు కాపాడుకుంటూ...

సారాంశం

IPL 2023: 87 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్.. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, రిలే రసో మెరుపులు... గత 5 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో రివెంజ్ వీక్ ట్రెండ్‌ని కొనసాగించడంలో ముంబై ఇండియన్స్ విఫలమైతే, ఢిల్లీ, ఆర్‌సీబీని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. 182 పరుగుల భారీ టార్గెట్‌ని ఆడుతూ పాడుతూ ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్, గత ఐదు మ్యాచుల్లో 4 విజయాలతో కమ్‌బ్యాక్ ఘనంగా చాటుకుంది...

డేవిడ్ వార్నర్, ఫిలిప్ సాల్డ్ కలిసి తొలి వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 14 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో డుప్లిసిస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు. 17 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో 3 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 24 పరుగులు రాబట్టాడు రిలే రసో.  ఈ ఓవర్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 42 బంతుల్లో 32 పరుగులే కావాల్సిన స్థితికి చేరుకుంది.  45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్, కర్ణ్ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 

అయితే వస్తూనే సిక్సర్ బాదిన అక్షర్ పటేల్, 8 పరుగులు చేయగా 22 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసిన రిలే రసో, సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించాడు. 


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ కలిసి తొలి వికెట్‌కి 82 పరుగులు జోడించారు.  32 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

ఆ తర్వాతి బంతికే గ్లెన్ మ్యాక్స్‌వెల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదిన మహిపాల్ లోమ్రోర్, విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. 

46 బంతుల్లో 5 ఫోర్లతో 55 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2023 సీజన్‌లో ఆరో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అదే ఓవర్‌లో ఫోర్ బాదిన మహిపాల్ లోమ్రోర్, 26 బంతుల్లో ఐపీఎల్ కెరీర్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. వస్తూనే సిక్సర్ బాదిన అనుజ్ రావత్ 3 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేయగా మహిపాల్ లోమ్రోర్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !