IPL 2023: మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఫ్లాప్... గుజరాత్ టైటాన్స్ ముందు ఈజీ టార్గెట్...

Published : Apr 04, 2023, 09:24 PM ISTUpdated : Apr 04, 2023, 11:13 PM IST
IPL 2023: మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఫ్లాప్... గుజరాత్ టైటాన్స్ ముందు ఈజీ టార్గెట్...

సారాంశం

మరోసారి అట్టర్ ఫ్లాప్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలే రసో.... మూడేసి వికెట్లు తీసిన రషీద్ ఖాన్, మహ్మద్ షమీ.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, రెండో మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో అలాంటి తప్పులే చేసింది. టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా విఫలం కావడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేసింది..

5 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన పృథ్వీ షా, మహ్మద్ షమీ బౌలింగ్‌లో అల్జెరీ జోసఫ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో ఓ ఫోర్ బాదిన మిచెల్ మార్ష్, ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

32 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ని అల్జెరీ జోసఫ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికి రిలే రసో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియా పట్టిన క్విక్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు రసో.. 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...

తొలి మ్యాచ్ ఆడుతున్న అభిషేక్ పోరెల్ 11 బంతుల్లో 2 సిక్సర్లతో 20 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 34 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి జోషువా లిటిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాదిన ఆమన్ ఖాన్, ఆ తర్వాతి బంతికి అదే స్టైల్‌లో ఇంకో షాట్‌కి ప్రయత్నించి హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.. మహ్మద్ షమీ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికి సిక్సర్ బాదిన అక్షర్ పటేల్, నాలుగో బంతికి అదే రకమైన షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసిన అక్షర్ పటేల్,  వరుసగా రెండో మ్యాచ్‌లోనూ బ్యాటుతో చక్కని ప్రదర్శన ఇచ్చాడు.  ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఆన్రీచ్ నోకియా ఫోర్ బాదడంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 160 పరుగులు దాటింది. 

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి  3 వికెట్లు తీయగా అల్జెరీ జోసఫ్ 2 వికెట్లు తీశాడు. మహ్మద్ షమీకి 3 వికెట్లు దక్కాయి.. 

 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : 9 మంది ఆల్‌రౌండర్లతో ఆర్సీబీ సూపర్ స్ట్రాంగ్.. కానీ ఆ ఒక్కటే చిన్న భయం !
స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు