
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇప్పటిదాకా ఐపీఎల్‌లో జరిగిన మొదటి 6 మ్యాచుల్లో 5 సార్లు హోం గ్రౌండ్‌లో ఆడిన జట్లే విజయం సాధించాయి. ఒక్క హైదరాబాద్ మాత్రమే హోంగ్రౌండ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో 50 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్...హోం గ్రౌండ్ సెంటిమెంట్‌పైనే ఆశలు పెట్టుకుంది.
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆఖరి ఓవర్‌లో విజయం సాధించి, 2023 సీజన్‌ని ఘనంగా ఆరంభించింది.
తొలి మ్యాచ్‌లో గాయపడిన కేన్ విలియంసన్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. నెదర్లాండ్స్‌తో సిరీస్ ముగించుకుని సౌతాఫ్రికా నుంచి వచ్చిన డేవిడ్ మిల్లర్, నేటి మ్యాచ్‌లో టీమ్‌కి అందుబాటులో ఉన్నాడు. దీంతో కేన్ విలియంసన్ స్థానంలో డేవిడ్ మిల్లర్ ఆడబోతున్నాడు.. శుబ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉండడం గుజరాత్ టైటాన్స్‌కి కలిసి వచ్చే విషయం..
గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి అవుటైన శుబ్‌మన్ గిల్, 2023 సీజన్‌లో టీ20ల్లో 265 పరుగులు చేశాడు. ఈ ఏడాది టీ20ల్లో గిల్ స్ట్రైయిక్ రేటు దాదాపు 170కి దగ్గర్లో ఉంది. బౌలింగ్‌లోనూ రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జెరీ జోసఫ్ అదరగొడుతున్నారు...
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ విభాగాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పృథ్వీ షా, మిచెల్ మార్ష్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు రాకపోతే నేటి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ విజయం సాధించడం కష్టమైపోతుంది..
డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేసినా 48 బంతులకు ఆడేశాడు. త్వరత్వరగా వికెట్లు పడడంతో వార్నర్ బ్యాటింగ్ నెమ్మదించింది. నేటి మ్యాచ్‌లో వార్నర్ నుంచి మునుపటి మెరుపులు చూడాలని ఆశిస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్..
అలాగే సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు లుంగి ఇంగిడి, ఆన్రీచ్ నోకియా రాకతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ పటిష్టంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అభిషేక్ పోరెల్ నేటి మ్యాచ్‌లో ఆరంగేట్రం చేస్తున్నాడు.. ఆన్రీచ్ నోకియాకి తుది జట్టులో చోటు ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్, లుంగి ఇంగిడిని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసింది.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు ఇది: శుబ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జోష్ లిటిల్, యష్ దయాల్, అల్జెరీ జోసఫ్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, రిలే రసో, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, ామన్ హకీం ఖాన్, ఖలీల్ అహ్మద్, ఆన్రీచ్ నోకియా