IPL 2023: సీఎఎస్కే టార్గెట్ టాప్ - 1 పొజిషన్.. హోంగ్రౌండ్‌లో కోల్కతా‌తో ఢీ.. టాస్ గెలిచిన ధోని

By Srinivas MFirst Published May 14, 2023, 7:03 PM IST
Highlights

IPL 2023, CSK vs KKR: ఐపీఎల్ -16 లో  మరోసారి టాప్ -1 పొజిషన్ ను దక్కించుకునేందుకు  చెన్నై సూపర్ కింగ్స్‌కు సూపర్ ఛాన్స్.. నేడు ఆ జట్టు కోల్కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది. 

ఐపీఎల్ -16  పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని  దక్కించుకోవడంతో పాటు   ప్లేఆఫ్స్  లో అన్నింటింకటే ముందే కర్చీప్ వేయడానికి   చెన్నై సూపర్ కింగ్స్ కు నేడు   సూపర్ ఛాన్స్.   మహేంద్ర సింగ్ ధోని  సారథ్యంలోని  చెన్నై సూపర్ కింగ్స్.. కోల్కతా నైట్ రైడర్స్ తో ఢీకొననుంది.  చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో  చెన్నై సూపర్ కింగ్స్  కెప్టెన్ ధోని  టాస్ గెలిచి  ఫస్ట్  బ్యాటింగ్  ఎంచుకున్నాడు.   నితీశ్ రాణా నాయకత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్  ఫస్ట్ బౌలింగ్ చేయనుంది. 

ఈ సీజన్ లో  12 మ్యాచ్ లు ఆడిన  చెన్నై.. ఏడింట్లో గెలిచి   నాలుగు ఓడి  15 పాయింట్లతో   పాయింట్ల పట్టికలో నెంబర్ 2  స్థానంలో ఉంది.  గుజరాత్ టైటాన్స్..  12 మ్యాచ్ లలో   8 గెలిచి  నాలుగింగిలో ఓడి  16 పాయింట్లతో  ఫస్ట్ ప్లేస్ లో ఉంది.  కేకేఆర్ తో  నేడు జరిగే మ్యాచ్ లో  చెన్నై  విజయం సాధిస్తే  అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంటుంది.  

Latest Videos

హోం గ్రౌండ్ లో చెన్నైకి తిరుగులేని రికార్డు ఉంది. గత మూడు మ్యాచ్ లలో చెన్నై ఇక్కడ మూడింటిలోనూ విజయాలు సాధించింది. ముంబై, ఢిల్లీ పై గెలిచిన  ధోని సేన    నేడు  కేకేఆర్   ను కూడా ఓడించాలని టార్గెట్ గా పెట్టుకుంది.  

ఈ సీజన్ లో 12 మ్యాచ్ లు ఆడి   ఐదు గెలిచి   ప్లేఆఫ్ ఆశలు అడుగంటిన వేళ   ఏమైనా చాన్స్ ఉంటే  అది కోల్కతాకు  నేటి మ్యాచ్ తో పాటు  మే 20న లక్నోతో మ్యాచ్ లో కూడా గెలిచి ఇతర జట్ల ఫలితాలు కూడా ఆ జట్టుకు అనుకూలంగా వస్తే అప్పుడు  ఛాన్స్ ఉంటుంది.  ఇది అసాధ్యమే గానీ   పాయింట్ల పట్టికలో ర్యాంకును మెరుగుపరుచుకోవడానికైనా  కేకేఆర్ కు ఈ మ్యాచ్ ఉపయోగపడొచ్చు.  

 

🚨 Toss Update 🚨 win the toss and elect to bat first against .

Follow the match ▶️ https://t.co/d7m0BcEtvi | pic.twitter.com/NCxFDhQ9J5

— IndianPremierLeague (@IPL)

తుది జట్లు : 

కోల్కతా నైట్ రైడర్స్ : రహ్మనుల్లా గుర్బాజ్, జేసన్ రాయ్, నితీశ్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రసెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా,  సుయాశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మోయిన్ అలీ,  రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ 

click me!