IPL 2023: మళ్లీ ఆ ఇద్దరే... ఫాఫ్, మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీలు! బౌలర్లపై భారం వేసిన బెంగళూరు...

Published : May 14, 2023, 05:10 PM ISTUpdated : May 14, 2023, 05:14 PM IST
IPL 2023: మళ్లీ ఆ ఇద్దరే... ఫాఫ్, మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీలు! బౌలర్లపై భారం వేసిన బెంగళూరు...

సారాంశం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీలు... ఆఖర్లో మెరుపులు మెరిపించిన అనుజ్ రావత్.. 


ఐపీఎల్‌ 2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా దాదాపు అస్సాం ట్రైన్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు చేతులు ఎత్తేశారు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ బ్యాటింగ్ భారాన్ని ఎక్కువ మ్యాచుల్లో మోసిన కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరోసారి హాఫ్ సెంచరీలతో రాణించినా మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆఖర్లో అనుజ్ రావత్ మెరుపులు మెరిపించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేయగలిగింది..

19 బంతుల్లో ఓ ఫోర్‌తో 18 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్‌తో కలిసి తొలి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రీజులో కుదురుకోవడానికి చాలా సమయం తీసుకున్న కోహ్లీ, కెఎం అసిఫ్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆర్‌సీబీ. ఈ దశలో ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కలిసి రెండో వికెట్‌కి 69 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం అందించారు. 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఏడో హాఫ్ సెంచరీ బాదాడు..

అంతేకాకుండా 2023 సీజన్‌లో 600 పరుగులు అందుకున్న మొదటి ప్లేయర్‌గానూ నిలిచాడు. ప్రమాదకరంగా మారుతున్న డుప్లిసిస్‌ కూడా అసిఫ్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

మహిపాల్ లోమ్రార్ 2 బంతుల్లో 1 పరుగు చేసి ఆడమ్ జంపా బౌలింగ్‌లో అవుట్ కాగా దినేశ్ కార్తీక్ 2 బంతులాడి డకౌట్ అయ్యాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో కార్తీక్‌కి ఇది 16వ డకౌట్. రోహిత్ శర్మతో కలిసి అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా తన రికార్డును మళ్లీ సమం చేసుకున్నాడు దినేశ్ కార్తీక్..

33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, సందీప్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 119/1 స్కోరుతో ఉన్న ఆర్‌సీబీ, 16 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి 137/5 స్థితికి చేరుకుంది..

ఆఖర్లో మెరుపులు మెరిపించిన అనుజ్ రావత్ పరుగులు చేయడంతో ఆర్‌సీబీ ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. అనుజ్ రావత్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేయగా మైకేల్ బ్రాస్‌వెల్ 9 బంతుల్లో 9 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఖరి 3 బంతుల్లో 6, 6, 4 బాదిన అనుజ్ రావత్, ఆర్‌సీబీ స్కోరు 170 మార్కు దాటించాడు. 
 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?