IPL 2023: చెన్నైతో ఢిల్లీ కీలక పోరు.. టాస్ గెలిచిన ధోని

By Srinivas MFirst Published May 10, 2023, 7:03 PM IST
Highlights

IPL 2023, CSK vs DC: ఇండియన్ ప్రీమియర్  లీగ్ - 16 పాయింట్ల పట్టికలో  అట్టడుగున ఉన్న  ఢిల్లీ క్యాపిటల్స్  ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే నేడు చెన్నైతో మ్యాచ్ లో తప్పక గెలవాల్సిందే. 

ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుని ఆ రేసులో నిలవాలంటే  కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో   ఢిల్లీ క్యాపిటల్స్ నేడు  చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతున్నది.   చెన్నైలోని చెపాక్ స్టేడియం  వేదికగా పాయింట్ల పట్టికలో  టాప్ -2లో ఉన్న సీఎస్కేతో  అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్  ఢీకొననుంది. ఈ మ్యాచ్ లో   ధోని సారథ్యంలతోని చెన్నై సూపర్ కింగ్స్  టాస్ గెలిచి తొలుత  బ్యాటింగ్ ఎంచుకుంది. డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్  జట్టు మొదలు బౌలింగ్ చేయనుంది. 

ఈ సీజన్ లో  11 మ్యాచ్ లు ఆడి  ఆరింట్లో గెలిచి  13 పాయింట్లతో    పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది చెన్నై.  ఐపీఎల్-16లో ధోని సేనకు నేటి మ్యాచ్ తో కలిపి మరో మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలున్నాయి.   అసలే  ఏ జట్టు ఎప్పుడు విజయం సాధించి ఎలా ముందుకొస్తుందో  ఎవరూ ఊహించని పరిస్థితుల్లో   ఆదమరిచి ఉండకూడదన్న ధోరణిలో సీఎస్కే  ఉంది.  

Latest Videos

ఢిల్లీతో గెలిచి తర్వాత రెండు మ్యాచ్ లలో ఒక్కటి గెలిచినా  చెన్నై ప్లేఆఫ్స్   బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే. స్వంత గ్రౌండ్ లో ఢిల్లీతో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని  చెన్నై  అంత ఈజీగా వదులుకోదనడంలో సందేహమే లేదు. లక్నోతో మ్యాచ్   వర్షార్ఫణమైనా  ఇటీవలే ముంబైని ఓడించిన ఆ జట్టు  ఫుల్ జోష్ లో ఉంది.   బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో  ధోని సేన పటిష్టంగా ఉంది. 

 

🚨 Toss Update 🚨 win the toss and elect to bat first against .

Follow the match ▶️ https://t.co/soUtpXQjCX | pic.twitter.com/pdB9vcbOuu

— IndianPremierLeague (@IPL)

టోర్నీలో ఆలస్యంగా మేలుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓడి  ఆ తర్వాత విజయాల బాట పట్టింది.  ఢిల్లీకి ప్లేఆఫ్  అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నా మొత్తానికి గేట్స్ అయితే ఇంకా మూసుకుపోలేదు. ఈ సీజన్ లో ఆడబోయే మిగిలిన నాలుగు మ్యాచ్ (నేటి మ్యాచ్ తో కలిపి)  లలో గెలిస్తే ఆ జట్టుకు  ప్లేఆఫ్స్ అవకాశాలుంటాయి.  ఇటీవలే గుజరాత్, బెంగళూరుపై  వచ్చిన విజయాలు ఆ జట్టులో జోష్  నింపాయి. మరి అదే జోష్ ను  చెన్నై మీద కొనసాగిస్తే ఆ జట్టు   పది పాయింట్లు సాధించి  పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది.  మరి వార్నర్ సేన  ఏం చేస్తుందో చూడాలంటే కొద్దిసేపు ఆగాల్సిందే. 

తుది జట్లు : 

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, మోయిన్ అలీ,  రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్),  దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, మతీశ పతిరన, తుషార్ దేశ్‌పాండే

ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, రిలీ రూసో, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

click me!