
ఐపీఎల్ 2023 సీజన్‌లో సర్‌ప్రైజింగ్ స్టార్‌గా నిలిచాడు అజింకా రహానే. టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ కోల్పోయి, టీమ్‌లో చోటు కూడా కరువైన అజింకా రహానే, ఐపీఎల్‌లో గత నాలుగు సీజన్లుగా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అలాంటి అజింకా రహానేని అద్భుతంగా వాడుకుంటోంది చెన్నై సూపర్ కింగ్స్...
ఐపీఎల్ 2023 మెగా వేలంలో అజింకా రహానేని బేస్ ప్రైజ్‌కి దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే పూజారా లాగే రహానే కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే రిజర్వు బెంచ్‌కే పరిమితం అవుతాడని అనుకున్నారంతా. అనుకున్నట్టే తొలి రెండు మ్యాచుల్లో ఆడని అజింకా రహానే, బెన్ స్టోక్స్, మొయిన్ ఆలీ గాయపడడంతో మూడో మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు..
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన అజింకా రహానే, అర్షద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో 6, 4, 4, 4, 4 బాది 23 పరుగులు రాబట్టాడు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని, 2023 సీజన్‌లో అప్పటిదాకా ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బ్రేక్ చేశాడు...
తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే జోరు కొనసాగించాడు అజింకా రహానే. 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసి లోకల్ భాయ్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. బ్యాటర్ల మైండ్‌సెట్ ఆటాడుకోవడం రవిచంద్రన్ అశ్విన్‌కి బాగా అలవాటు...
ఆరో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన అశ్విన్ బౌలింగ్‌లో మూడో బంతికి ఓ భారీ సిక్సర్ బాదాడు అజింకా రహానే. ఆ తర్వాతి బంతిని వేసేందుకు ముందుకు వచ్చిన అశ్విన్, రహానే యాక్షన్ చూసి బంతి వేయకుండా ఝలక్ ఇచ్చి వెళ్లిపోయాడు. అశ్విన్ ఇలా చేయడం కొత్తేమీ కాదు. చాలామంది బ్యాటర్లకు ఇలా ఝలక్ ఇచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...
అశ్విన్ బౌలింగ్ చేస్తుంటే నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్లు కూడా ఎక్కడ మన్కడింగ్ రనౌట్ చేస్తాడేమోనని భయపడతారు. అయితే ఆ తర్వాతి బంతికి అశ్విన్‌కి రివర్స్ ఝలక్ ఇచ్చాడు అజింకా రహానే. అశ్విన్ బాల్ డెలివర్ చేసే ముందు నాట్ రెఢీ అన్నట్టుగా బ్యాటింగ్ పొజిషన్ నుంచి తప్పుకున్నాడు. రహానే చేసిన ఈ పనికి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా అరిచి, చప్పట్లు కొట్టారు..
సౌమ్యుడు, మృధు స్వభావిగా గుర్తింపు తెచ్చుకున్న అజింకా రహానే ఇలా చేయడం మాత్రం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. రెండు మ్యాచుల్లో కలిపి 92 పరుగులు చేసిన అజింకా రహానే, ఇదే ఫామ్‌ని కొనసాగిస్తే టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు...
శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్ అయ్యాక జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా అయ్యర్ ఆడడం అనుమానమే. సూర్యకుమార్ యాదవ్‌కి టెస్టుల్లో ఒకే ఒక్క ఇన్నింగ్స్ ఆడిన అనుభవం మాత్రమే ఉంది. వన్డేల్లో, ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా సూర్య ఫెయిల్ అవుతున్నాడు. దీంతో అజింకా రహానేకి, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో చోటు ఫిక్స్ అవ్వాలంటే ఇదే ఫామ్‌ని కొనసాగిస్తే సరిపోతుంది.